Ranji Trophy: కూతురు పోయిన బాధను దిగమింగి.. శతకంతో మెరిసి.. బరోడా క్రికెటర్ విషాద గాధ

Published : Feb 26, 2022, 09:52 AM ISTUpdated : Feb 26, 2022, 09:57 AM IST
Ranji Trophy: కూతురు పోయిన బాధను దిగమింగి.. శతకంతో మెరిసి..  బరోడా క్రికెటర్ విషాద గాధ

సారాంశం

Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీలో భాగంగా  బరోడా కు చెందిన ఓ ఆల్ రౌండర్ శతకంతో మెరిశాడు. ఆ.. చాలా మంది సెంచరీలు చేస్తారు.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..?

బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్ లో శతకంతో చెలరేగాడు. ఇందులో వింతేముంది..?  అందరు క్రికెటర్లలాగా అది కూడా ఓ సాధారణ శతకమే కదా..  డబుల్ సెంచరీ, త్రిబుల్ సెంచరీ కాదుగా..? సోలంకి చేసిన శతకమేమీ  తక్కువ బంతుల్లో  చేసిందా..?  అని అనుకుంటున్నారా..? కానీ ఈ శతకానికి ఓ ప్రత్యేకత ఉంది. అందరు క్రికెటర్ల మాదిరిగా మైదానంలో   స్వేచ్ఛగా ఆడుతూ హాయిగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ చేసింది కాదు. కొద్దిరోజుల క్రితమే అతడి  జీవితంలో ఓ తీవ్ర విషాధ  గాధ చోటు  చేసుకుంది. 
 
రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ లో భాగంగా.. బరోడా  ఆల్ రౌండర్ 161 బంతుల్లో శుక్రవారం నాటి ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్దిరోజులకే ఆ పసికందు అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది.  రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్న సోలంకికి ఈ విషయాన్ని  దిగమింగి మరీ సెంచరీతో మెరిశాడు. 

 

రంజీ ట్రోపీలో బరోడా తరఫున ఆడుతున్న సోలంకి.. ఈ విషయం తెలియగానే  హుటాహుటిన  కూతురు దగ్గరకు వెళ్లి   ఆ పసికందు అంత్యక్రియలను నిర్వహించాడు.  కానీ ఆట మీద మక్కువతో   ఆ బాధను  పంటి బిగువనే దిగమింగి మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. 

చండీగఢ్ తో మ్యాచులో సందర్భంగా  ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  సోలంకి.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికంటే  ముందు సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. సోలంకి సెంచరీతో బరోడా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో   చండీగఢ్ జట్టు.. 168 పరుగులకే ఆలౌట్ అయింది.  దీంతో  బరోడాకు తొలి ఇన్నింగ్స్ లో 230 పరుగుల ఆధిక్యం దక్కింది. 

 

ఇదిలాఉండగా.. సోలంకి ఆటతీరుపై  క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అంత బాధను దిగమింగి మంచి ఇన్నింగ్స్ ఆడావు. నీ ఆటకు సలామ్  సోలంకి..’  అంటూ క్రికెట్ అభిమానులు  సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !