నిదానంగా ఆడుతున్న బంగ్లా.. విజయం దిశగా పయనం.. వికెట్ల కోసం భారత బౌలర్ల ఎదురుచూపులు

By Srinivas MFirst Published Dec 4, 2022, 5:37 PM IST
Highlights

BANvsIND: ఇండియా-బంగ్లాదేశ్ మధ్య  జరుగుతున్న తొలి వన్డేలో  భారత్ ను  తక్కువ స్కోరుకే  పరిమితం చేసిన   బంగ్లా బౌలర్లు.. బ్యాటింగ్ లో నెమ్మదిగా ఆడుతున్నారు.  సాధించాల్సిన స్కోరు పెద్దగా లేకపోవడంతో... 
 

ఢాకా వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డేలో  ఆతిథ్య జట్టు  విజయం దిశగా పయనమవుతున్నది. ఢాకా వేదికగా జరుగుతున్న  తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆ జట్టు  29 ఓవర్లు ముగిసేసరికి 4 నష్టానికి 110 పరుగులు  చేసింది.  ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం అతిశయోక్తే.  

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ కు తొలి బంతికే షాక్ తాకింది. దీపక్ చాహర్ వేసిన  తొలి ఓవర్లో  మొదటి బంతికే  షాంతో (0).. స్లిప్స్ లో  ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.  చాహర్ తో పాటు సిరాజ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాకు పరుగుల రాక గగనమైంది.  

29 బంతులాడిన అనముల్ 14 పరుగులు చేసి  సిరాజ్  వేసిన పదో ఓవర్ తొలి బంతికి వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చాడు. పది ఓవర్లకు బంగ్లా స్కోరు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు. ఈ సిరీస్ లో బంగ్లాకు సారథిగా వ్యవహరిస్తున్న లిటన్ దాస్ (63 బంతుల్లో  41, 3 ఫోర్లు, 1 సిక్సర్) షకిబ్ అల్ హసన్ (38 బంతుల్లో 29, 3 ఫోర్లు) తో కలిసి  బంగ్లా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 48 పరుగులు జోడించారు. అయితే 63 బంతులాడిన  లిటన్ దాస్.. వాషింగ్టన్ సుందర్ వేసిన 20 ఓవర్ రెండో బంతికి  వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు.  20 ఓవర్లు ముగిసేరికి  బంగ్లా..  3 వికెట్లు కోల్పోయి  77 పరుగులు చేసింది. 

భారత  బ్యాటింగ్ వెన్ను విరిచిన షకిబ్.. షాబాజ్ అహ్మద్ వేసిన  23వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. కానీ  వాషింగ్టన్ భారత్ కు మరో బ్రేక్ ఇచ్చాడు. 23.2 వ ఓవర్లో  సుందర్.. షకిబ్ ను  పెవిలియన్ కు పంపాడు.    దీంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. 

ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ నిష్క్రమించాక  ముష్ఫీకర్ రహీమ్ (11 నాటౌట్), మహ్మదుల్లా (8 నాటౌట్) లు క్రీజులోకి వచ్చారు.  ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు.   29 ఓవర్లు ముగిసేసరికి  బంగ్లా.. 4 వికెట్ల నష్టానికి  110 పరగులు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరో వికెట్ పడితే గానీ మిగతా బంగ్లా బ్యాటర్ల పనిపడితే గానీ  భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం కష్టం.  మరోవైపు బంగ్లా.. 21 ఓవర్లలో 77 పరుగులు చేస్తే చాలు.  చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో  ఆ జట్టు చేరువైంది. 

click me!