''ప్రపంచ కప్ జట్టు పగ్గాలు ధోనికే... కోహ్లీ మామూలు ఆటగాడే''

By Arun Kumar PFirst Published May 27, 2019, 7:57 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని ఎంత సక్సెస్‌ఫుల్ కెప్టెనో అందరికి తెలిసు. అతడి సారథ్యంలోనే టీమిండియా వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఆ తర్వాత  భారత జట్టుకు కెప్టెన్సీకి దూరమైనా ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా తానేంటో నిరూపించుకుంటూనే వున్నాడు. ఇలా ఇప్పటికే కెప్టెన్ గా ఉన్నత శిఖరాలపై నిలిచిన కెప్టెన్ కూల్ ప్రపంచ కప్ నేపథ్యంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.  

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ తన ఆల్ టైమ్ వరల్డ్ కప్ ఎలెవన్ జట్టును ప్రటించాడు. ఈ జట్టులో తనకు నచ్చిన ఆటగాళ్లకు చోటు కల్పించాడు. ఇలా ఆ జట్టులో  భారత్ నుండి నలుగురు, పాకిస్థాన్ నుండి ఇద్దరికి చోటు దక్కింది. అయితే తన ఆల్ టైమ్ వరల్డ్ కప్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనిని సారథిగా ఎంపిక చేసినట్లు ఇక్బాల్ వెల్లడించాడు. దీంతో ధోని కెప్టెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో మరోసారి బయటపడింది. 

ఇక్బాల్ భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ -వీరేంద్ర సెహ్వాగ్‌లను ఓపెనర్లుగా, ప్రస్తుత భారత  కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడో స్థానానికి  ఎంపికచేయగా చేశాడు. ఇక ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దించనున్నట్లు తెలిపాడు. అయితే ఈ జట్టులో భారత బౌలర్లెవరికీ ఇక్బాల్ చోటు కల్పించలేడు. 

ఇక ఇక్బాల్ తన ప్రపంచ కప్ టీమ్ లో సొంత జట్టు నుండి కేవలం షకీబుల్ హసన్ ను మాత్రమే తీసుకున్నాడు. అతడికి ఆల్ రౌండర్ కోటాలో చోటు కల్పించాడు. పాకిస్థాన్ నుంచి ఫాస్ట్ బౌలర్ల స్థానంలో వసీం అక్రమ్, షోయబ్ అక్తర్‌ లకు చోటిచ్చాడు. ఇక ఈ జట్టులో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఒక్కరే స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకున్నారు. 
 
తమీమ్ ఇక్బాల్ ఆల్ టైమ్ వరల్డ్ కప్ ఎలెవన్ జట్టు:

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, కలిస్, షకీబల్ హసన్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వసీం అక్రం, షోయబ్ అక్తర్, గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్.

click me!