డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు.. సిడ్నీ టెస్టులో స్టీవ్ స్మిత్ రికార్డుల హోరు..

Published : Jan 05, 2023, 11:24 AM IST
డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు.. సిడ్నీ టెస్టులో స్టీవ్ స్మిత్ రికార్డుల హోరు..

సారాంశం

AUSvsSA: సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో  జరుగుతున్న  మూడో టెస్టులో స్టీవ్ స్మిత్  సెంచరీ బాది రికార్డుల మోత మోగించాడు.  టెస్టులలో స్మిత్ కు  ఇది 30వ సెంచరీ.

ఆధునికి క్రికెట్ లో ఫ్యాబ్ -4 గా పిలిచే  నలుగురు దిగ్గజ బ్యాటర్లలో  ఒకడు స్టీవ్ స్మిత్. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్  లు ఈ జాబితాలో ఉన్నారు.  తాజాగా  స్మిత్ సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో  జరుగుతున్న  మూడో టెస్టులో   సెంచరీ బాది రికార్డుల మోత మోగించాడు.  టెస్టులలో స్మిత్ కు  ఇది 30వ సెంచరీ. ఈ శతకం ద్వారా   స్మిత్.. ఆల్ టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు.  టెస్టులలో బ్రాడ్‌మన్ పేరిట 29 సెంచరీలు ఉండగా  స్మిత్ ఇప్పుడు  ఆ రికార్డును అధిగమించాడు. 

సిడ్నీ టెస్టులో  స్మిత్.. 192 బంతుల్లో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.  తద్వారా 33 ఏండ్ల స్మిత్  పలు రికార్డులను  బ్రేక్ చేశాడు.   డాన్ బ్రాడ్‌మన్ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడి 80 ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు చేయగా  స్మిత్ కు ఇది 92వ టెస్టు.  162 ఇన్నింగ్స్ లలో స్మిత్ ఈ ఘనత  సాధించాడు. 

ఈ సెంచరీతో  స్మిత్.. ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో అత్యధిక సెంచరీలు చేసిన  ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.  ఈ జాబితాలో  రికీ పాంటింగ్.. 41 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా  మాజీ సారథి  స్టీవ్ వా 32  సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.  మాథ్యూ హెడెన్ కూడా 30 సెంచరీలు చేయగా  స్మిత్ అతడితో సమానంగా నిలిచాడు.  

 

బ్రాడ్‌మన్ తో పాటు మైఖేల్ క్లార్క్, మాథ్యూ హెడెన్ ల రికార్డులను కూడా స్మిత్ చెరిపేశాడు.  ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు (టెస్టులలో) చేసిన  జాబితాలో ఉన్న మాథ్యూ హెడెన్.. (103 టెస్టులలో 8,625 పరుగులు), క్లార్క్ (115 టెస్టులలో 8,643 పరుగులు) రికార్డులను బద్దలుకొట్టాడు.  ఈ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా అతడి పరుగులు 8,647కు  చేరాయి.   

 

ఇదిలాఉండగా దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.   ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  (193 బ్యాటింగ్) డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.   లబూషేన్ (79) తో పాటు స్మిత్ (104) మెరుగ్గా ఆడారు.  ట్రావిస్ హెడ్ (70 నాటౌట్)  సెంచరీ దిశగా  సాగుతున్నాడు. ఆట రెండో రోజు మూడో సెషన్ లో 127 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. 3 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !