
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ముగిసిన మూడో వన్డే లోనూ కివీస్ కు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే రెండు వన్డేలు కోల్పోయిన న్యూజిలాండ్.. కేయిన్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో కూడా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (105)సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్.. 242 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్.. 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. 13 బంతుల్లో 5 పరుగులే చేసి సౌథీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (10 కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
అయితే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన స్టీవెన్ స్మిత్.. 131 బంతుల్లో 105 పరుగులతో కివీస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. లబూషేన్ (52) తో కలిసి మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదరకంగా పరిణమిస్తున్న ఈ జోడీని ఫెర్గూసన్ విడదీశాడు. ఫెర్గూసన్ వేసిన 33.5 ఓవర్లో మూడో వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన అలెక్స్ కేరీ (42)తో కలిసి ఆసీస్ స్కోరుబోర్డును స్మిత్ ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే కెరీర్లో 40వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ తర్వాత స్మిత్.. సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో కామెరూన్ గ్రీన్ (25 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆసీస్ ఆ మాత్రమైనా స్కోరు చేసింది.
అనంతరం మెస్తారు లక్ష్య ఛేదనలో కివీస్.. భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమైంది. కివీస్ బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. గ్లెన్ ఫిలిప్ప్ ఒక్కడే 47 పరుగులతో టాప్ స్కోరర్.ఓపెనర్ ఫిన్ అలెన్ (35), డెవాన్ కాన్వే (21)లు తొలి వికెట్ కు 49 పరుగులు జోడించారు. కాన్వేను అబాట్ ఔట్ చేశాడ. కానీ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ (27) సహా టామ్ లాథమ్ (10), డారిల్ మిచెల్ (16) విఫలమయ్యారు. జేమ్స్ నీషమ్ (36), మిచెల్ సాంట్నర్ (30)లు చివర్లో పోరాడినా కీలకసమయంలో వికెట్ల చేజార్చుకున్నారు. ఫలితంగా కివీస్. 49.5 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది.