అశ్విన్ ఏ తప్పు చేయలేదు.. మన్కడింగ్ ఉండాలి: ఎంసీసీ క్లీన్‌చీట్

By Siva KodatiFirst Published Mar 27, 2019, 1:28 PM IST
Highlights

అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిలిన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మద్ధతుగా నిలిచింది. మన్కడింగ్ నిబంధన విషయమై క్లారిటీ ఇచ్చిన ఎంసీసీ.. ఇందులో అశ్విన్ తప్పు ఏమాత్రం లేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది.

రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ మధ్య చెలరేగిన ‘‘మన్కడింగ్’’ వివాదం.. ఐపీఎల్‌తో పాటు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో అశ్విన్ ఈ విధంగా చేసి క్రీడా స్పూర్తిని దెబ్బ తీశాడని పలువురు మాజీలు, అభిమానులు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిలిన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మద్ధతుగా నిలిచింది. మన్కడింగ్ నిబంధన విషయమై క్లారిటీ ఇచ్చిన ఎంసీసీ.. ఇందులో అశ్విన్ తప్పు ఏమాత్రం లేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది.

అంతేకాకుండా మన్కడింగ్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేసింది. ఈ నిబంధన లేకుంటే నాన్ స్ట్రైకర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు.. ఇలా జరగకుండా ఉండాలంటే మన్కడింగ్ ఉండాలని తెలిపింది. కాగా బౌలర్ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించే విషయం నిబంధనలో లేదని.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం కూడా కాదని స్పష్టం చేసింది.

టీవీ అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే బట్లర్ ఔటైనట్లుగా ప్రకటించాడని.. నాన్‌స్ట్రైకర్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని.. అలాగే బౌలర్లు కూడా నిబంధనలకు లోబడే టైమ్ ఫ్రేమ్‌లోనే బౌలింగ్ చేయాలని ఎంసీసీ స్పష్టం చేసింది.

కాగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అశ్విన్.. రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంలో ఔట్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!