డేవిడ్ వార్నర్ షాట్ సెలెక్షన్ పై పెదవి విరిచిన పాంటింగ్

By telugu teamFirst Published Aug 17, 2019, 7:55 AM IST
Highlights

బంతి బ్యాట్ ఎడ్జ్ ను తీసుకోవడం వల్ల అది బ్యాక్ వర్డ్ పాయింట్ కు చేరుతోందని, షార్ట్ అండ్ వైడ్ బంతులను విశ్వాసంతో ఎదుర్కోవాలని, బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించాలని పాంటింగ్ వార్నర్ కు సలహా ఇచ్చాడు. 

లండన్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ షాట్ సెలెక్షన్ పట్ల మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోర్ సాధించడంలో వార్నర్ విఫలమవుతున్నాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం పాంటింగ్ అన్నాడు. యాషెస్ సిరీస్ లో వార్నర్ పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడని అన్నాడు. 

భారీ స్కోరు సాధించే అవకాశాలను వార్నర్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని, ఇది నిరాశకు గురి చేసే విషయమని అన్నాడు. దూరంగా వెళ్తున్న బంతులను వార్నర్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, బంతిని అంచనా వేయడంలో విఫలమవుతున్నాడని, దాంతో బంతి బ్యాట్ ఎడ్జ్ ను తీసుకుంటోందని పాంటింగ్ వివరించాడు. 

బంతి బ్యాట్ ఎడ్జ్ ను తీసుకోవడం వల్ల అది బ్యాక్ వర్డ్ పాయింట్ కు చేరుతోందని, షార్ట్ అండ్ వైడ్ బంతులను విశ్వాసంతో ఎదుర్కోవాలని, బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించాలని పాంటింగ్ వార్నర్ కు సలహా ఇచ్చాడు. ఒత్తిడికి గురి కాకుండా బంతిని అంచనా వేస్తూ వార్నర్ బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. 

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. నిషేధ కాలం పూర్తయి తిరిగి జట్టులోకి వచ్చాడు వార్నర్. ప్రస్తుతం ఇంగ్లాండుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో స్మిత్, వార్నర్ ఆడుతున్నారు. తొలి టెస్టులో స్మిత్ 144, 142 పరుగులు చేశాడు. వార్నర్ మాత్రం 2,8 పరుగులు మాత్రమే చేశాడు. 

రెండో టెస్టు ఇన్నింగ్సులో కూడా వార్నర్ విఫలమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ వార్నర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు కూడా వార్నర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగులోనే అవుట్ కావడం విశేషం

click me!