యాషెస్ సీరిస్: ఆర్చర్ దెబ్బకు ఆసిస్ విలవిల...179 స్కోరుకే ఆలౌట్

Published : Aug 23, 2019, 10:07 AM IST
యాషెస్ సీరిస్: ఆర్చర్ దెబ్బకు ఆసిస్ విలవిల...179 స్కోరుకే ఆలౌట్

సారాంశం

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఆతిథ్య జట్టు అదరగొట్టింది. మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టును చిత్తుచేసే దిశగా ఆ జట్టు ప్రయాణం సాగుతోంది.  

యాషెస్ సీరిస్ లో భాగంగా  జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొడుతున్నారు. గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు తక్కువ పరుగులకే కుప్పకూల్చింది. కేవలం 52.1 ఓవర్లపాటు మాత్రమే ఆసిస్ బ్యాటింగ్ చేసి 179 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో మొదటిరోజు ఆసిస్ పై ఇంగ్లాండ్ దే పైచేయిగా నిలిచింది.

రెండో టెస్టులో పదునైన బంతులతో ఆస్ట్రేలియా ఆటగాళ్లను బెంబేలెత్తించి జోఫ్రా ఆర్చర్ మరోసారి చెలరేగాడు. ఈ మ్యాచ్ లోనూ అదరగొట్టిన అతడు తన టెస్ట్ కెరీర్లోనే అత్యత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో అతడు కేవలం 45 పరుగులు మాత్రమే  సమర్పించుకుని ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్ లో ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం అతడి కెరీర్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. 

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 61 పరుగులు, లబుషేన్  74 పరుగులు మాత్రమే రాణించారు. వీరిద్దరే 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని  విడగొట్టిన తర్వాత ఆసిస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 45 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో 179 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ముగిసింది. 

ఇంగ్లీష్ బౌలర్లలో ఆర్చర్ తో పాటు బ్రాడ్ బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు కేవలం 32 పరుగులు మాత్రమే సమర్పించుకుని 2 వికెట్లు పడగొట్టాడు. ఆసిస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం మొదలవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగకుండానే మొదటిరోజు ఆట ముగిసింది. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?