ఖవాజా సెంచరీ.. బజ్‌బాల్‌కు కౌంటర్ ఇస్తున్న కంగారూలు

Published : Jun 18, 2023, 10:41 AM IST
ఖవాజా సెంచరీ.. బజ్‌బాల్‌కు కౌంటర్ ఇస్తున్న  కంగారూలు

సారాంశం

Ashes 2023: ఇంగ్లాండ్ తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా  ధీటుగా బదులిస్తోంది. ఆస్ట్రేలియా  ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  సెంచరీతో రాణించాడు. 

యాషెస్ - 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్  వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ధీటుగా  బదులిస్తోంది.  ఆసీస్  ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (279 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు).. అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్ బజ్‌బాల్ అప్రోచ్‌కు కంగారూలు కౌంటర్ ఇస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజే మరో రెండు వికెట్లు ఉన్నా డిక్లేర్ చేసి అందర్నీ ఆశ్చర్యరపరిచి రెండో రోజు ఆసీస్‌ను తమ  పేస్  ఉచ్చులో  బంధిద్దామని  భావించిన ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లుతూ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీలు ఆస్ట్రేలియాను నిలబెట్టారు. 

ఓవర్ నైట్ స్కోరు  14 పరుగుల వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన  ఆస్ట్రేలియా..  ఫస్ట్ సెషన్ లోనే తడబడింది.  డేవిడ్ వార్నర్ (9) మరోసారి స్టువర్ట్ బ్రాడ్ వలలో చిక్కగా  వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాటర్  మార్నస్ లబూషేన్  లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. 

నాలుగో స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ (16)  కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు.  స్మిత్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్   ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 67కే ఆసీస్ 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.. 

ఖవాజా - హెడ్‌ల సూపర్ పార్ట్‌నర్‌షిప్.. 

కష్టాల్లో ఉన్న ఆసీస్ ను  మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్)   తో కలిసి ఉస్మాన్ ఖవాజా  ఆదుకున్నారు. ఈ ఇద్దరూ  ఇంగ్లాండ్ పేసర్లను, స్పిన్నర్ మోయిన్ అలీని సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు  81  పరుగులు జోడించారు. ఆ తర్వాత  హెడ్ ఔట్ అయినా ఖవాజా.. కామెరూన్ గ్రీన్ (38), అలెక్స్ కేరీ (52 నాటౌట్) లతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి  ఆసీస్.. 94 ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.  తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. ఇంకా  82 పరుగులు వెనుకబడే ఉంది.  

ఉస్మాన్ సూపర్ సెంచరీ.. 

రెండో రోజు ఆటలో ఉస్మాన్ ఖవాజా బ్యాటింగే హైలైట్. 2011 లో టెస్టులలోకి ఎంట్రీ ఇచ్చిన  ఖవాజా.. అరంగేట్రం తర్వాత ఏకంగా  12 ఏండ్లకు ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేశాడు. ఖవాజా  ఫస్ట్ టెస్టు ఆడింది కూడా ఇంగ్లాండ్ లోనే  కావడం గమనార్హం.   యాషెస్ లో కూడా అతడికి ఇది  ఇంగ్లాండ్ లో తొలి  సెంచరీ. ఓవరాల్ గా 15వ సెంచరీ.  అందుకే అతడు సెంచరీ తర్వాత బ్యాట్ ను గాల్లోకి ఎగిరేసి  సెలబ్రేట్ చేసుకున్నాడు.  2022 నుంచి  సూపర్ ఫామ్ చూపిస్తున్న ఖవాజాకు ఇది  గతేడాది నుంచి ఏడో సెంచరీ కావడం విశేషం.  ఖవాజా.. 2022 పాకిస్తాన్ లో, ఈ ఏడాది ఇండియాలో   స్పిన్ పిచ్ ల మీద  సెంచరీలు సాధించి ఇప్పుడు ఇంగ్లాండ్ ఫ్లాట్ పిచ్ మీద   రెండు వికెట్లు తీసి చెలరేగిన మోయిన్ అలీ బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : హిట్ మ్యాన్ కెరీర్ లో అత్యంత కఠిన సమయం ఇదే.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?