అనుష్క శర్మ ఐరన్ లేడీ... షోయక్ అక్తర్ పొగడ్తల వర్షం..!

Published : Sep 10, 2022, 09:34 AM IST
  అనుష్క శర్మ ఐరన్ లేడీ... షోయక్ అక్తర్ పొగడ్తల వర్షం..!

సారాంశం

ఈ క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన ఒక వ్యక్తి  తన  భార్య అనుష్క అని కూడా చెప్పారు. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా అని చెప్పాడు. 

ఆసియాకప్ 2022లో భాగంగా ఆప్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో... విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 1020 రోజుల తర్వాత కోహ్లీ ఈ సెంచరీ చేయడం గమనార్హం. అభిమానుల నిరీక్షణను ఈ సెంచరీతో ఆయన ముగింపు పలికాడు. కాగా... కోహ్లి తన 71వ అంతర్జాతీయ శతకం, తొలి T20I సెంచరీని భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికకు అంకితం చేశాడు.

అంతేకాదు.. తన విజయం వెనక తన భార్య అనుష్క శర్మ ఉందని కూడా కోహ్లీ చెప్పాడు.  ఈ క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన ఒక వ్యక్తి  తన  భార్య అనుష్క అని కూడా చెప్పారు. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా అని చెప్పాడు. 

కాగా.. కోహ్లీ చేసిన కామెంట్స్ పై పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.కోహ్లీ విజయం వెనక అనుష్క ఉందని అక్తర్ పొగడ్తల వర్షం కురిపించాడు.  విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తన భార్య అనుష్క గురించి మాట్లాడడని అక్తర్ చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన అనుష్క శర్మ కు హ్యాట్సాఫ్ చెప్పాడు. అనుష్క ఒక ఐరన్ లేడీ అంటూ ప్రశంసించాడు. ఇక.. విరాట్ కోహ్లీ ఉక్కు కండరాలతో తయారైన ఐరన్ మ్యాన్ అని పేర్కొన్నాడు. ఇక.. విరాట్ కోహ్లీకి.. కంగ్రాంట్స్ తెలియజేశాడు. కోహ్లీ గొప్ప మనసున్న వ్యక్తి అని.. జీవితంలో మరింత ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్ గా మిగిలిపోతారని పేర్కొన్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !