ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలి.. తన బాధకు కారణం చెప్పిన రసెల్

By telugu news teamFirst Published Apr 24, 2021, 10:23 AM IST
Highlights

ఛేజింగ్ రూమ్ కి కూడా వెళ్లకుండా.. అక్కడే కూలపడిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రసెల్ కి అభిమానులు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. 
 

ఐపీఎల్ మ్యాచ్ లు చాలా రంజుగా సాగుతున్నాయి. ఈ సీజన్ లో ఇటీవల చెన్నైసూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. చెన్నై చేసిన భారీ స్కోర్ ని చేధించే క్రమంలో.. కోల్ కతా క్రికెటర్లు అందరూ వెంట వెంటనే ఔట్ అయిపోయారు. మ్యాచ్ మొదట్లోనే అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ.. రసెల్ అదరగొట్టాడు. విజయం దక్కకున్నా.. చెన్నైకి ముచ్చెమటలు పట్టించాడు.

అయితే.. సరిగ్గా కీలక సమయంలో.. రసెల్ ఔట్ అయిపోయాడు. దీంతో.. ఔట్ తర్వాత రసెల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. కనీసం ఛేజింగ్ రూమ్ కి కూడా వెళ్లకుండా.. అక్కడే కూలపడిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రసెల్ కి అభిమానులు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. 

అయితే.. తాను ఛేజింగ్ కి రూమ్ కి కూడా వెళ్లకుండా నిరాశకు గురవ్వడానికి గల కారణాన్ని తాజాగా రసెల్ వివరించాడు.

‘అవును.. ఔటైన తర్వాత ఛేంజింగ్‌ రూమ్‌కు వెళ్లలేకపోయా. రూమ్‌కి ఎలా వెళ్లాలో తెలియక మెట్లపై కూర్చొండిపోయా.
మా జట్టు సభ్యుల వద్దకు వెళ్లే ధైర్యం చేయలేకపోయా. వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతాం అనిపించింది. నేను వదిలేసాననుకున్న బంతి వికెట్లను పట్టుకుపోయింది. అది నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కువగా ఎమోషనల్‌ అవుతూ ఉంటా. అవే నన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి. నా జాబ్‌ ఇంకా కంప్లీట్‌ కాలేదు.  మా జట్టును గాడిలో పెట్టడమే నా ముందున్న కర్తవ్యం’ అని రసెల్‌ పేర్కొన్నాడు. 

click me!