హాట్‌స్టార్ సర్వర్ డౌన్.. ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు ప్రత్యక్ష ప్రసారానికి బ్రేకులు...

Published : Feb 17, 2023, 03:31 PM IST
హాట్‌స్టార్ సర్వర్ డౌన్.. ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు ప్రత్యక్ష ప్రసారానికి బ్రేకులు...

సారాంశం

Hotstar Down: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  ఢిల్లీ వేదికగా జరుగుతున్న టెస్టును హాట్‌స్టార్ లో చూస్తున్న అభిమానులకు షాక్. హాట్‌స్టార్ లో సాంకేతిక లోపాల కారణంగా ప్రత్యక్ష ప్రసారం రావడం లేదు. 

భారత క్రికెట్ జట్టుకు  అధికారిక ప్రసారదారుగా ఉన్న  స్టార్ నెట్వర్క్ పార్ట్‌నర్ కంపెనీ ‘డిస్నీ హాట్‌స్టార్’టీమిండియా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య  ఢిల్లీ వేదికగా జరుగుతున్న   మ్యాచ్ ను లైవ్ ద్వారా వీక్షిద్దామనుకున్న అభిమానులు సుమారు గంట నుంచి   మ్యాచ్ ను వీక్షించడం లేదు.   డిస్నీ హాట్‌స్టార్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా యాప్ మొత్తంగా క్రాష్ అయింది.  

ఒక్క ఫోన్లలలోనే కాదు..  కంప్యూటర్, ల్యాప్‌టాప్ తెరలపైనా   హాట్‌స్టార్ ఓపెన్ కావడం లేదు.  డొమైన్ టైమ్ ను  సంబంధిత టెక్నికల్ టీమ్ వాళ్లు  పునరుద్దరించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తున్నది. 

సాంకేతిక సమస్యలతో హాట్‌స్టార్ రాకపోవడంతో   సోషల్ మీడియా వేదికగా  యాప్ పై  మీమ్స్ వెల్లువెత్తాయి.   అయితే   హాట్‌స్టార్ లో రాకున్నా  లైవ్ అప్డేట్స్ కోసం  స్కోరును అందించే సైట్లు  చాలానే ఉన్నాయి.  లైవ్ ద్వారా వీక్షించాలంటే మాత్రం హాట్‌స్టార్ తో పాటు జియో టీవీలో  కూడా   చూడొచ్చు.  

 

 

హాట్‌స్టార్ సర్వర్ డౌన్ కావడంతో   అందుకు సంబంధించి నెటిజన్లు ఫన్నీ మీమ్స్, వీడియోస్ తో ట్రోలింగ్ కు దిగారు.  ఇప్పుడు ఈ మీమ్స్ వైరల్ గా మారాయి.  మరీ ముఖ్యంగా చేతన్ శర్మ రాజీనామా చేసిన తర్వాత  అందరూ  దానిని మరిచిపోవడానికి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తే సడెన్ గా హాట్‌స్టార్ డౌన్ కావడంతో అతడు  ప్రేక్షకులు తన గురించి ఎక్కడ వెతుకుతారో అన్నట్టుగా రూపొందించిన మీమ్  నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.  

 

బ్రేక్ ఇచ్చిన జడ్డూ.. 

ఇదిలాఉండగా ఢిల్లీ టెస్టులో  ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న   ఆస్ట్రేలియాను ఆదుకున్న  కమిన్స్-హ్యాండ్స్‌కాంబ్ జోడీని  జడ్డూ విడదీశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ జోడీని  రవీంద్ర జడేజా  తాను వేసిన  68వ ఓవర్లో కమిన్స్ (33) ను ఔట్ చేశాడు.  అదే ఓవర్లో జడ్డూ.. టాడ్ మర్ఫీ (0) ని కూడా క్లీన్ బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించేందుకు  ప్రణాళిక సిద్ధం చేశాడు. జడ్డూ వేసిన అదే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా  68 ఓవర్లకు  8 వికెట్ల నష్టానికి  227 పరుగులు చేసింది.  హ్యాండ్స్‌కాంబ్ (54 నాటౌట్) తో పాటు  నాథన్ లియన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !