
భారత జట్టు త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇదివరకే భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు కరేబియన్ దీవులకు చేరుకున్నారు. తొలి టెస్టుకు టైమ్ దగ్గరపడుతుండటంతో క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఈ మేరకు 18 మందితో కూడిన టీమ్ ను ప్రకటించింది. అయితే ఇది ఫస్ట్ టెస్టు ఆడే టీమ్ కాదు.
డొమినికా వేదికగా జరుగబోయే తొలి టెస్టుకు గాను వెస్టిండీస్ బోర్డు అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ (సీసీజీ) లో జూన్ 30 నుంచి ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటుచేసింది. 18 మంది సభ్యులు ఈ క్యాంప్ లో పాల్గొంటారు.
టెస్టు సిరీస్ కు కొద్దిరోజుల ముందు 15 మందితో కూడిన జట్టును క్రికెట్ వెస్టిండీస్ త్వరలోనే ప్రకటించనుంది. విండీస్ క్రికెట్ ట్విటర్ లో ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఈ క్యాంప్ లో విండీస్ టీమ్ ను క్రెయిగ్ బ్రాత్‌వైట్ సారథిగా వ్యవహరించనున్నాడు.
విండీస్ జట్టు ప్రకటించిన 18 మందిలో పేసర్ జేడన్ సీల్స్ తిరిగి జట్టుతో చేరాడు. 2022 డిసెంబర్ లో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గాయం వల్ల అతడు ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆడలేదు. కానీ త్వరలోనే డొమినికా టెస్టులో సీల్స్ ఆడనున్నాడు.
వెస్టిండీస్ ట్రైనింగ్ స్క్వాడ్..
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అతనజె, జెర్మైన్ బ్లాక్‌వుడ్, కృమా బోనర్, టి. చందర్‌పాల్, రహకీమ్ కార్న్‌వాల్, జోషువా డ సిల్వ, షనోన్ గాబ్రియల్, కవెమ్ హడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్ అలిస్టర్, కిర్క్ మెకంజీ, మార్కినో మిండ్లే, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడన్ సీల్స్ , జొమెల్ వారికన్
ఇండియా - వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ ఇది..
జులై 12-16 : తొలి టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : తొలి వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - బార్బోడస్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 3 : తొలి టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా