అగస్త్యకు 8 నెలలు.... కొడుకుతో కలిసి చిందులేసిన హార్ధిక్ పాండ్యా, నటాశా...

Published : Mar 31, 2021, 10:01 AM IST
అగస్త్యకు 8 నెలలు.... కొడుకుతో కలిసి చిందులేసిన హార్ధిక్ పాండ్యా, నటాశా...

సారాంశం

కొడుకుకి 8 నెలలు నిండిన సందర్భంగా అగస్త్యను విష్ చేసిన నటాశా, హార్ధిక్ పాండ్యా...  బుడ్డోడితో కలిసి చిందులేస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పాండ్యా ఫ్యామిలీ...

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యా 8 నెలలు పూర్తిచేసుకున్నాడు. సెర్బియన్ నటి నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ప్రకటించిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత ఆమె గర్భవతి అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లికాకముందే ఓ బిడ్డకు తల్లి అయిన నటాశా స్టాంకోవిక్... జూలై 30న అగస్త్యకు జన్మనిచ్చింది...

కొడుకుకి 8 నెలలు నిండిన సందర్భంగా అగస్త్యను విష్ చేసిన నటాశా, హార్ధిక్ పాండ్యా... బుడ్డోడితో కలిసి చిందులేశారు...

నెల వయసున్న కొడుకుని వదిలిపెట్టి, ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ వెళ్లిన హార్ధిక్ పాండ్యా, అటు నుంచి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాడు. ‘టెస్టు సిరీస్ ఆడతావా’ అని అడిగితే... కొడుకును వదిలి ఉండలేనని, వెళ్లిపోతానని చెప్పాడు హార్ధిక్ పాండ్యా...

 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !