Mankading: మన్కడింగ్ నిషేధంపై సర్వత్రా హర్షం.. ఇప్పటికైనా సాధించామన్న వినూ మన్కడ్ కుమారుడు

Published : Mar 10, 2022, 02:29 PM IST
Mankading: మన్కడింగ్ నిషేధంపై సర్వత్రా హర్షం.. ఇప్పటికైనా సాధించామన్న వినూ మన్కడ్ కుమారుడు

సారాంశం

MCC Bans On Mankading: భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

క్రికెట్ చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్ (నాన్ స్ట్రైకర్  బ్యాటర్ రనౌట్)ను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే భారత క్రికెట్ దిగ్గజాలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు  అన్ ప్లేయర్ ప్లే విభాగంలో ఉన్న ‘మన్కడ్’ ఔట్ విధానాన్ని ఇప్పుడు రనౌట్ కేటగిరీలోకి మార్చుతూ ఎంసీసీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  దీనిపై చాలా కాలంగా పోరాడుతున్న భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ (ఆయన కూడా మాజీ క్రికెటరే..) తో  పాటు  మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. 

మన్కడింగ్  పదాన్ని నిషేధించాలని   అది అతడి గౌరవానికి భంగం వాటిల్లేలా  చేస్తుందని వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ గతంలో పలుమార్లు ఐసీసీకి లేఖలు కూడా రాశాడు. ఇటీవలి కాలంలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ లో  జోస్ బట్లర్ ను  ఈ విధంగా ఔట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. 

ఎందుకాపేరు...?  

1948లో భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్  ఆసీస్ వికెట్ కీపర్ బిల్ బ్రౌన్ ను ఇదే తీరులో ఔట్ చేశాడు. దీంతో ఆ ఔట్ ను ఆస్ట్రేలియా మీడియా ‘మన్కడింగ్ ఔట్’ అని  పిలిచింది. అప్పట్నుంచి ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ గా పిలుస్తున్నారు. అయితే దీనిపై  భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిలవడం ద్వారా విను మన్కడ్ పేరు, ప్రతిష్టను దిగజార్చుతున్నారని సన్నీ తో పాటు  వినూ కుమారుడు రాహుల్ మన్కడ్ ఆవేదన చెందారు. 

ఇన్నాళ్లకు ఫలించింది.. 

తాజాగా మన్కడింగ్  క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, దానిని కూడా సాధారణ రనౌట్ గానే పరిగణించాలని ఎంసీసీ.. క్రికెట్ నిబంధనల్లో మార్పులు చేసిన నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల నిజమైంది.  మన్కడింగ్ ను నిషేధించాలని మేము చాలా కాలంగా ఐసీసీని కోరుతున్నాం. ఇన్నాళ్లకు ఎంసీసీ మా మొర ఆలకించింది. ఇకనుంచి మా నాన్న పేరు ఇందులో వినబడదు. ఇక  నేను ఈ విషయం తెలిసినప్పుడు లండన్ లో ఉన్నాను. ఇటీవలే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. నిన్ననే నాకు డాక్టర్లు గుండెకు స్టంట్ వేశారు. మళ్లీ నాకు  గుండెపోటు వచ్చింది. వైద్యులు మరోసారి ఆపరేషన్ చేయాలన్నారు. 

 

ఇదే విషయమై గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇకనుంచి ఇండియన్ లెజెండ్  మన్కడ్ పేరును దుష్ప్రచారం చేయడానికి వీల్లేకుండా మార్పులు చేసిన ఎంసీసీకి కృతజ్ఞతలు. ఇప్పట్నుంచి ఇది సాధారణ రనౌట్ గానే పరిగణించబడుతుంది..’ అని అన్నాడు. 

1940-50 మధ్య కాలంలో భారత జట్టు తరఫున 44 టెస్టులు ఆడిన వినూ మన్కడ్.. 2,109 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 162 పరుగులు చేశాడు.  భారత క్రికెట్ దిగ్గజాలలో అతడు ఒకడు. 

ఇక మన్కడింగ్ ను నిషేధించడంపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. ‘మన్కడింగ్  పట్ల నేనెప్పుడూ  అసౌకర్యంగా ఫీలయ్యేవాడిని. ఒక దిగ్గజం పేరును ఇలా  వాడుతున్నందుకు  చాలా బాధపడేవాడిని.  ఇక దానిని  సాధారణ రనౌట్ గా మార్చడం నాకు  సంతోషంగా ఉంది..’ అని అన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Hardik : ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు !
గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..