కివీస్ వర్సెస్ ఇండియా: ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు

By telugu teamFirst Published Jan 29, 2020, 2:43 PM IST
Highlights

ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డును సాధించాడు. ఓపెనర్ గా పది వేల పరుగుల మైలురాయిని దాటి నాలుగో బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. న్యూజిలాండ్ పై మూడో టీ20లో ఆయన ఈ ఘనత సాధించాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ పై మూడో టీ20లో ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. ఓపెనర్ గా పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 

హామిల్టన్ లో న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో టీ20లో రోహిత్ శర్మ ఆ రికార్డును సాధించాడు. ఇంతకు ముందు ఓపెనర్లుగా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఆ ఘనతను సాధించారు. 

Also Read: రోహిత్ వారిని చెత్త కింద కొట్టేశాడు: కంగూరులను హేళన చేసిన షోయబ్ అక్తర్

ఇన్నింగ్స్ ఆరో ఓవరులో రోహిత్ శర్మ పది వేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. సిక్స్ బాది అతను ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2007లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ తన కెరీర్ ను ప్రారంభించాడు. 

చాంఫియన్స్ ట్రోఫీలో బాగంగా 2013లో ఇంగ్లాండుపై జరిగిన మ్యాచు లో ఓపెనర్ ఆరంగేట్రం చేశాడు. ఓపెనర్ గా రాణించడంతో రోహిత్ శర్మ అదే స్థానంలో కొనసాగుతున్నాడు.

ఓపెనర్ గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 77 టీ20లు ఆడి 236 పరుగులు చేశాడు. 140 వన్డేలు ఆడి 7148 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా రోహిత్ శర్మ ఖాతాలోనే ఉంది. 

Also Read: 9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ

న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 మ్యాచుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ విపలమయ్యాడు. తొలి మ్యాచులో 7 పరుగులు, రెండో మ్యాచులో 8 రుగులు చేశాడు. మూడో మ్యాచులో మాత్రం దూకుడుగా ఆడి పరుగులు సాధించాడు. 

click me!