నీ నెంబర్ డిలీట్ చేయాలా..? బంగ్లా క్రికెటర్ పై బీసీబీ చీఫ్ ఫైర్

By telugu teamFirst Published Oct 25, 2019, 1:26 PM IST
Highlights

క్రికెటర్లు అలా సమ్మెకు పిలుపు ఇవ్వడంతో... బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపం మొత్తాన్ని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హాసన్ పై ప్రదర్శించారు. క్రికెటర్లు సమ్మె చేపట్టడానికి మెహదీ హాసనే కారణమని నజ్ముల్ అభిప్రాయపడ్డారు. అందుకే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్  ... తమ దేశ ఆటగాళ్ల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ...బంగ్లా క్రికెటర్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా భారత్  పర్యటనకు ముందు వాళ్లు ఇలా సమ్మె చేపట్టడంతో.... తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా... వారి డిమాండ్లను పరిష్కరించడానికి బీసీబీ ముందుకు రావడంతో.. క్రికెటర్లు సమ్మెను విరమించారు.

అయితే... క్రికెటర్లు అలా సమ్మెకు పిలుపు ఇవ్వడంతో... బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపం మొత్తాన్ని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హాసన్ పై ప్రదర్శించారు. క్రికెటర్లు సమ్మె చేపట్టడానికి మెహదీ హాసనే కారణమని నజ్ముల్ అభిప్రాయపడ్డారు. అందుకే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం... క్రికెటర్లతో జరిగిన సమావేశంలో నజ్ముల్..‘‘ మెహదీ.. నేను మీ కోసం ఏం చెయ్యలేదో చెప్పండి. నువ్వు కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నీ ఫోన్ నెంబర్ డిలీట్ చేయాలా’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మీటింగ్ తర్వాతే.. బంగ్లా క్రికెటర్లు తమ సమ్మెను విరమించుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ మండలితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అందుకే తాము సమ్మెను విరమించినట్లు క్రికెటర్లు తెలిపారు.

కాగా.. ఆటగాళ్లు చేపట్టిన మెరుపు సమ్మె వెనుక కుట్ర దాగి ఉందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) భావిస్తోంది. సమ్మె విషయమై మీడియాను సంప్రదించడానికంటే ముందు బీసీబీతో చర్చిస్తే బాగుండేదని బోర్డు చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఆట ప్రతిష్ఠను దెబ్బ తీసేం దుకే ఈ సమ్మె చేపట్టారని, దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే కనుక్కుంటామని పేర్కొన్నారు . దేశంలో గందరగోళం సృష్టిం చడంతో ఆట ఇమేజీని దెబ్బతీయడానికే దీన్ని చేపట్టారని నజ్ముల్‌ వ్యాఖ్యానిం చారు.
 

click me!