అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు... విరాట్ కి సునీల్ గవాస్కర్ చురకలు

By telugu teamFirst Published Nov 25, 2019, 8:15 AM IST
Highlights

ఇది చాలా గొప్ప విజయమని దానిని తాను  ఒప్పుకుంటున్నానని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కానీ ఓ విషయం గురించి ఇప్పుడు తాను చెప్పాలని అనుకుంటున్నాన్న్నారు. బుద్ధి బలంతో టెస్టు క్రికెట్ ను అద్వితీయ విజయాలను సాధించడం సౌరవ్ గంగూలీ జట్టు నుంచే ప్రారంభమైంది అన్న కెప్టెన్ విరాట్ కామెంట్స్ పై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

కాగా... జట్టు విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశారు.  కేవలం దాదా(గంగూలీ) కారణంగానే విజయం సాధించామని... అసలు ఈ విజయ పరంపర దాదాతోనే మొదలైందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికేట్ అనేది ఓ మానసిక యుద్ధం లాంటిదని.. దానిని ఎలా జయించాలో తాము సౌరవ్ గంగూలీనీ చూసి నేర్చుకున్నామని కోహ్లీ చెప్పాడు. గంగూలీపై కోహ్లీ ప్రశంసలు కురిపించడాన్ని మాజీ క్రికెటర్  సునీల్ గవాస్కర్ చురకలు అంటించారు.

ఇది చాలా గొప్ప విజయమని దానిని తాను  ఒప్పుకుంటున్నానని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కానీ ఓ విషయం గురించి ఇప్పుడు తాను చెప్పాలని అనుకుంటున్నాన్న్నారు. బుద్ధి బలంతో టెస్టు క్రికెట్ ను అద్వితీయ విజయాలను సాధించడం సౌరవ్ గంగూలీ జట్టు నుంచే ప్రారంభమైంది అన్న కెప్టెన్ విరాట్ కామెంట్స్ పై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్... ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని నీకు ఉండొచ్చు. తప్పులేదు. కానీ... టీమిండియా 1970,1980లలో కూడా మంచి విజయాలు సాధించింది. అప్పటికి కోహ్లీ నువ్వు ఇంకా పుట్టలేదు.’’ అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 

‘‘ చాలా మంది ఇండియన్ క్రికెట్.. 2000 సంవత్సరంలో ప్రారంభమైందని అనుకుంటారు. కానీ 1970 సంవత్సరంలోనే భారత జట్టు విదేశాలలో గెలిచింది. భారత జట్టు కూడా 1986 లో గెలిచింది. భారత్ కూడా విదేశాలలో సిరీస్ డ్రా చేసింది.’ అని సునీల్ గవాస్కర్ తెలిపారు. కాగా... గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర  చర్చనీయంశమయ్యాయి.  

click me!