కరోనా వైరస్ పై సోషల్ మీడియా వస్తున్న తప్పుడు వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అందులో ఫార్వార్డ్ మెసేజెస్ మరింతగా వ్యాపిస్తుండటంతో ప్రజలకు కొత్త భయాలు పట్టుకుంటున్నాయి.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఈరోజుల్లో ఎలాంటి సమాచారం అయినా ఎక్కడినుంచైనా వెంటనే చేరవేయొచ్చు. ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచందేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్విస్తున్నారు. అయితే కరోనా వైరస్ పై సోషల్ మీడియా వస్తున్న తప్పుడు వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
అందులో ఫార్వార్డ్ మెసేజెస్ మరింతగా వ్యాపిస్తుండటంతో ప్రజలకు కొత్త భయాలు పట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి తప్పుడు సమాచారాలకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇప్పుడు కొత్త రూల్ తీసుకొస్తుంది. ఏదైనా తప్పుడు సమాచారానికి, నకిలీ వార్తలు అడ్డూ వేయనుంది .
పాత వార్తలు, పాత వీడియోలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ, కామెంట్లు జోడిస్తూ పోస్ట్ చేస్తు వుండటం ఆందోళన పుట్టిస్తుంది. చట్టపరంగా వీటి నిరోధానికి చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ ఫేక్ న్యూస్ ప్రవాహం ఆగడం లేదు.
also read ఇంట్లో ఉండే వారికి టిసిఎస్ అద్భుత అవకాశం... వారికోసం ఫ్రీ ట్రైనింగ్..
ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు, వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, టిక్ టాక్ లాంటి ప్లాట్ ఫాంలలో విరివిగా షేర్ అవుతూ అనేక అపోహలను, ఆందోళనలు రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒకసారి ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ కొత్త ఆంక్షలు విధించింది. ఇక మీదట తరుచుగా షేర్ చేసే మెసేజ్ లేదా, వీడియోను ఒక చాట్ కు ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా పరిమితి విధించింది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ రోజునుంచే ఈ కొత్త నిబంధన వర్తించనుంది.
అలాగే తరచుగా ఫార్వార్డ్ చేసిన వాటిని యూజర్లు గుర్తించేలా డబుల్ టిక్ తో హైలైట్ చేస్తుంది. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో 25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.