మరో రెండు రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. మధ్యప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్ మొదటి సారిగా కేసులు నమోదు

By team telugu  |  First Published Dec 26, 2021, 2:24 PM IST

మరో రెండు కొత్త రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తమ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం ప్రకటించాయి. దీంతో ఒమిక్రాన్ సోకిన రాష్ట్రాల జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి. 


కరోనా మళ్లీ కలరవపెడుతోంది. రెండు వేవ్ లు ఇప్ప‌టికే దేశాన్ని అత‌లాకుత‌లం చేశాయి. మ‌ళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మ‌రో ముప్పు ముంచుకొస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు అది అన్ని ప్ర‌పంచ దేశాల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 38 దేశాల్లో ఈ ఓమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. యూకేలో దీని తీవ్రత ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ ప్ర‌తీ రోజు దాదాపు 9 వేల కంటే ఎక్కువ‌గానే ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మన దేశంలో కూడా దీని తీవ్రత కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు భారత్ లో కేసుల సంఖ్య 415కు చేరుకుంది. 

తెలంగాణ: కొత్తగా 140 మందికి కరోనా.. 6,80,553కి చేరిన మొత్తం కేసులు

Latest Videos

undefined

కొత్తగా రెండు రాష్ట్రాల్లో.. 
మన దేశంలో కొత్తగా మరో రెండు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయని ఆయా రాష్ట్రాలు ఆదివారం వెల్ల‌డించాయి. మధ్యప్రదేశ్‌లో గత 45 రోజులలో విదేశాల నుండి ఇండోర్‌కు తిరిగి వచ్చిన ఎనిమిది మంది వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్ బయటపడింది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం సేకరించిన తొమ్మిది నమూనాల్లో ఒకటి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది.  మధ్యప్రదేశ్ లో నమోదైన ఎనిమిది కేసుల్లో ముగ్గురు యూఎస్ఏ నుంచి, యూకే, టాంజానియాల‌ నుంచి ఇద్ద‌రు చొప్పున‌, ఘనా నుంచి ఒక‌రు వ‌చ్చారు. ఈ ఎనిమిది ఒమిక్రాన్ కేసులు కాకుండా, మరో 18 మంది ఇత‌ర కోవిడ్ -19 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చిన కేసు కెనడా నుంచి మండికి తిరిగి వ‌చ్చిన మ‌హిళ‌లో గుర్తించారు. 

ఒక‌వైపు ఒమిక్రాన్‌... మ‌రోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్ష‌న్.. !
ఇండియాలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 415 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అందులో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో న‌మోదైన కేసుల‌ను చేర్చ‌లేదు. మ‌హారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజ‌రాత్‌లో 43 కేసులు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళ‌నాడు రాష్ట్రాల్లో క‌లిపి 144 కేసులు ఉన్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 2 కేసులు ఉన్నాయి. అయితే ఈ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్ వారియర్స్ కు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్‌కు, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు మ‌రో మోతాదు వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం రాత్రి తెలిపింది. అలాగే వ్యాక్సినేష‌న్ లో వెన‌క‌బ‌డిన, క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న 10 రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక బృందాల‌ను పంపించాల‌ని నిర్ణ‌యించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల అధికారుల‌తో క‌లిసి ప‌ని చేస్తారు. వ్యాక్సినేష‌న్ లో వేగం పెంచేందుకు కృషి చేస్తారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను సూచిస్తారు. ప్ర‌తీ రోజూ సాయంత్రం కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక పంపిస్తారు. 

click me!