
ఒమిక్రాన్ పేషెంట్ కు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు - ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్
ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ ను మొదట గుర్తించినా.. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ పాగా వేస్తోంది. దాదాపు 57 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇండియాలో కూడా ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. డిసెంబర్ 2వ తేదీన ఈ కొత్త వేరియంట్ ను కర్నాటక మొదటిసారిగా గుర్తించారు. ఇప్పటికే ఇండియాలో 700 కేసులు దాటాయి. ఈ వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతున్నాయనే వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హెల్త్ మినిస్టర్ చేసిన ఓ ప్రకటన కొంత ఊరటనిస్తోంది.
Omicron Cases in India: భారత్‌లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
పాజిటివిటీ రేటు 1 శాతం
దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. నైట్ కర్ప్యూ కూడా విధించింది. ఇది వరకే క్రిస్మస్ వేడులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాటు న్యూయర్ వేడుకలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లిలో 496 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే పాజిటివిటీ రేటు 1 శాతంగా నమోదయ్యిందని తెలిపారు. అనంతరం ఒమిక్రాన్ కేసులు విషయంలోనూ హెల్త్ మినిస్టర్ స్పందించారు. ఒమిక్రాన్ సోకిన రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని కోరారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన పేషెంట్లలో ఒక్కరికి కూడా ఆక్సిజన్ పెట్టాల్సిన అసవరం రాలేదని చెప్పారు. వారు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో కమ్యూనిటీ వ్యాప్తి పెద్దగా లేదని అన్నారు. అంతర్జాతీయ విమానాల రాకతో కేసులు పెరిగాయని చెప్పారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటిస్తేనే కోవిడ్ అదుపులో ఉంటుందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను అందరూ పాటించాలని సూచించారు.
Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ముంబయిలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుదల
24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదు..
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కి చేరిందని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా వల్ల 302 మృతిచెందారని తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,80,592కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292కి చేరుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 77,002 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తన బులిటెన్‌లో పేర్కొంది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 781కి చేరుకున్నాయి. ఇందులో 238 కేసులతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.