ఢిల్లీలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 331 కరోనా కేసుల నమోదయ్యాయి. జూన్ 9 నుంచి ఇవే అత్యధిక కేసులని కేంద్ర మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం తెలిపింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. యూకే, అమెరికాలో ఈ వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలో 38 దేశాలకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంట్ ఇండియాలో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కేసులు 400పైగా దాటాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ కేసులతో పాటు కోవిడ్ -19 ఇతర వేరియంట్లకు చెందిన కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆ రంగంలో.. తెలంగాణ 3వ స్థానం.. ఏపీ 4వ స్థానం
undefined
జూన్ 9 తరువాత అత్యధిక కేసులు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన డేటా ప్రకారం ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.68 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జూన్ 9 నుండి అత్యధిక రోజువారీ సంఖ్య అని ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇది ఆందోళన కలిగించే విషయం. దీంతో పాటు ఒక వ్యక్తి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. కొత్త కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,43,683కి చేరుకుంది. మరణాల సంఖ్య 25,106కి పెరిగింది. ఇప్పటివరకు 14.17 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ కేసులు కూడా ఢిల్లీలోనే అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 142 కేసులు ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికం. అలాగే మహారాష్ట్ర (141), కేరళ (57), గుజరాత్ (49) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అవసరమైతే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించండి.. ఒమిక్రాన్ దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ
నేటి నుంచి నైట్ కర్ఫ్యూ..
ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు తీసుకుంటుంది. కరోనాను అదుపులో ఉంచుకునేందుకు ముందస్తుగానే ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురానుంది. ఇది రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉండనుంది. అయితే నైట్ నైట్ కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. స్థానికంగా ఉండే దుకాణాల నుంచి సరుకులు, కూరగాయలు పాలు, ఇంటికి అవసరమయ్యే ఇతర అవసరాల కోసం కాలినడకన వెళ్లే వారికి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల నుంచి, బస్టాప్‌లకు వెళ్లే వారికి, ఆ ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వారికి మినహాయింపు ఇచ్చారు. అయితే వారు అక్కడి నుంచి వస్తున్నట్టు ధృవీకరించుకోవాలి. అంటే టికెట్ లేదా బోర్డింగ్ పాస్ వంటివి అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టులకు మినహాయింపు ఉంటుంది. ఫుడ్, మెడిసిన్, ఇతర ట్రీట్‌మెంట్ కు సంబంధించిన వస్తువులు డెలివరీలు చేసే వ్యక్తులను మినహాయించారు. ఇంతకు ముందే క్రిస్మస్ వేడుకలును కూడా ఢిల్లీలో నిర్వహించుకోనివ్వలేదు. అలాగే న్యూయర్ వేడుకలను కూడా రద్దు చేసింది. ఇదే దారిలో మిగితా రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి.