పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఒక్క ఢిల్లీలోనే గడిచిన 24 గంట్లలో 1200కి పైగా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో నలుగురు చనిపోయారు.
కరోనా కలవరపెడుతోంది. కొంత కాలం కిందటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు మళ్లీ విధించడం ప్రారంభించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 1204 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు ఒక మరణం కూడా సంభవించింది. 863 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. కాగా ఢిల్లీలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఐదో రోజు. దీంతో దేశ రాజధానిలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4508కి చేరుకుంది.
undefined
హెల్త్ బులిటెన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.42 శాతం నుంచి 4.64 శాతంకు పడిపోయింది. కరోనా కేసులు పెరిగినప్పటికీ హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఢిల్లీలో యాక్టివ్ గా ఉన్న కేసుల్లో మొత్తం 3109 కోవిడ్ పాజిటివ్ రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. 114 మంది మాత్రమే ఆసుపత్రులలో చేరారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 153 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 135 మంది కరోనాతో కోలుకున్నారు. అయితే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మహారాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు ఇప్పుడు 943కి చేరుకున్నాయి. ఈ కేసుల్లో అత్యధికంగా ముంబైలోనే కేసులు ఉన్నాయి. ఆ సిటీలో మొత్తంగా 549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 77 కోవిడ్ -19 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కరోనాతో 38,025 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా కరోనా కేసులు పెరుగుతుండంతో ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలో మాస్కుల వినియోగాన్ని ఆయా ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఈ జిల్లాన్నీ ఎన్ సీఆర్ చుట్టుపక్కలే ఉన్నాయి. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా కోవిడ్-19 పాల్గొన్నారు.