coronavirus : నేటి నుంచి తమిళనాడులో ఆదివారాలు పూర్తి స్థాయి లాక్ డౌన్

By team telugu  |  First Published Jan 9, 2022, 8:48 AM IST

నేటి నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఆదివారాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 


క‌రోనా (corona) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ (night curfew), వీకెంట్ క‌ర్ఫ్యూ (weekend curfew)ల‌ను అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. అయితే తమిళనాడులో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదివారాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. 

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు నేటి ఆదివారం నుంచే ఈ లాక్ డౌన్ నిబంధ‌న అమ‌ల్లోకి రానుంది. ఈ రాష్ట్రంలో కోవిడ్ - 19  (COVID-19) వ్యాప్తిని అరికట్టడానికి త‌మిళ‌నాడు అంత‌టా నైట్ క‌ర్ఫ్యూ (night curfew) విధించింది. దీంతో అన్ని రోజులలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయి. కేవ‌లం అత్య‌వ‌స‌ర‌మైన కార్య‌క‌లాపాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. 

Latest Videos

undefined

లాక్ డౌన్‌లో వీటికే అనుమ‌తి..
నేటి ఆదివారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే లాక్ డౌన్ లో కొన్ని అత్య‌వ‌స‌మైన సేవ‌ల‌కు మాత్ర‌మే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అనుమ‌తి  ఇచ్చింది. ఇందులో భాగంగా లాక్ డౌన్ స‌మ‌యాల్లో పాలు, ఏటీఎం (ATM)  కేంద్రాలు, హాస్పిట‌ల్స్, హాస్పిట‌ల్స్ కు సంబంధించిన పనులు, సరుకు రవాణా, పెట్రోల్ బంక్‌లు వంటి ముఖ్యమైన సేవలు పనిచేస్తాయి. మెట్రో, ప్రజా రవాణా సేవలు పూర్తిగా మూసివేసి ఉంటాయి.  రెస్టారెంట్లు, హోటళ్లు కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పార్శిల్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విమానం, ట్రైన్స్ ద్వారా వ‌చ్చే ప్రయాణికులు తమ టికెట్టు తీసుకొని వెంట ఉంచుకోవాలి. త‌నిఖీ స‌మ‌యాల్లో అధికారులు అడిగితే వాటిని చూపించాలి. అలాగే రైల్వే స్టేష‌న్స్ కు, విమానాశ్రయానికి వెళ్లాల‌నుకునే వారు ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ వంటివి వెంట తీసుకోవాలి. 

కోవిడ్ -19 (COVID-19) భద్రతా నియ‌మావ‌ళిని అనుస‌రించి ఇంట్రా ప్రైవేట్, ప‌బ్లిక్ రవాణా కు అనుమ‌తి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పాల సరఫరా, వార్తాపత్రికల పంపిణీతో పాటు హాస్పిట‌ల్, రీసెర్చ్ సెంట‌ర్స్‌, మెడికల్ షాపులు, అంబులెన్స్‌లు, శ‌వాలను తీసుకెళ్లే వాహ‌నాలకు అనుమ‌తి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ బంకులు పనిచేస్తాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ప‌ని చేస్తుంటే ఆ సంస్థ‌లు, కంపెనీలు జారీ చేసే ఐడీ కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోం సాధ్యం కాని కొన్ని తయారీ రంగాలు, ఐటీ రంగాలు మాత్రమే పని చేయడానికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. 

ఒక్క రోజులోనే 10,978 కేసులు..
గ‌డిచిన 24 గంటల్లో త‌మిళ‌నాడులో 10,978 కొత్త కోవిడ్-19 ((COVID-19)) కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శ‌నివారం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఈ కొత్త కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,87,391కి చేరుకుందని వెళ్ల‌డించింది.క‌రోనాతో పోరాడుతూ 10 మంది మృతి చెందారు. దీంతో త‌మిళ‌నాడులో రాష్ట్రంలో కోవిడ్ మ‌రణాల సంఖ్య 36,843కి చేరుకుంది. గత 24 గంటల్లో మొత్తం 1,525 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 40,260 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 

click me!