Coronavirus : ఢిల్లీల్లో ఒక్క రోజులో 26 శాతం పెరిగిన కోవిడ్ పాజిటివిటీ.. ఇద్ద‌రు మృతి

By team telugu  |  First Published Apr 17, 2022, 10:44 AM IST

దేశ రాజధానిలో మళ్లీ కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. థర్డ్ వేవ్ సమయంలో కూడా ఇలాగే మొదట ఢిల్లీలో కేసులు పెరిగాయి. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. 


ఢిల్లీలో కోవిడ్ క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం నాడు ఈరోజు కోవిడ్-19 పాజిటివ్ రేటు 5.33 శాతంగా నమోదైంది, ఇది శుక్ర‌వారం నాటితో పోలిస్తే 26 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

గ‌డిచిన 24 గంటల్లో జాతీయ రాజధానిలో మొత్తంగా 461 కొత్త క‌రోనా కేసులు నమోదయ్యాయ‌ని అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. అలాగే కోవిడ్ వ‌ల్ల ఇద్దరు వ్యక్తులు కోవిడ్‌తో మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న కేసుల వ‌ల్ల పాఠశాల విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌కు దారి తీశాయి. 

Latest Videos

undefined

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి సోమ‌వారం పాజిటివ్ వచ్చింది. దీంతో మిగితా పిల్ల‌ల‌ను స్కూల్ కు పంపించ‌వ‌ద్ద‌ని ఆ స్కూల్ యాజ‌మాన్యం త‌ల్లిదండ్రుల‌ను కోరింది. ఈ విష‌యాన్ని వార్తా సంస్థ పీటీఐ వెల్ల‌డించింది. అయితే అవసరమైన చోట నితరగతి గదులను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాల అధికారులకు చెప్పింది.

క‌రోనా కేసుల విష‌యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. దేశ రాజధానిలో కోవిడ్ పెరుగుతున్నాయ‌ని, అయితే ఆసుపత్రిలో త‌క్కువ‌గా ఉన్నాయ‌ని తెలిపారు. ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పాఠశాలలు ఏదైనా కేసును గుర్తిస్తే ప్రభుత్వ ప్రామాణిక నిర్వహణ విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. 

కాగా  ఢిల్లీలో శుక్ర‌వారం కోవిడ్ -19తో 53 మంది హాస్పిట‌ల్ లో చేరారు. అయితే ఇందులో 14 మంది చిన్నారులు ఉన్నారు. హాస్పిట‌ల్ లో చేరిన చాలా మంది కోమోర్బిడీల‌ను క‌లిగి ఉన్నారు. ఈ పిల్ల‌ల్లో 12 మంది ఢిల్లీలోని కళావతి సరన్ హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇంత మంది పిల్ల‌లు హాస్పిటల్ లో చేరినా.. క‌రోనా సోకిన వారి వారి సంఖ్య పెరగలేదు.

శుక్రవారం ఢిల్లీలో 3.95 శాతం పాజిటివ్ రేటుతో 366 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శుక్రవారం విద్యార్థులకు మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలల మూసివేత అనేది చివరి ఎంపిక అని పేర్కొంది. 

ఇదిలా ఉండ‌గా గత కొంత కాలంగా చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల పుట్టుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, దక్షిణ కొరియా స‌హా ప‌లు  యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల గుర్తించిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు ఇప్ప‌టివ‌ర‌కు వేగంగా వ్యాపించే.. అధిక ప్ర‌భావం క‌లిగిన వేరియంట్ల కంటే 10 రెట్లు ప్ర‌భావిత‌మైన‌విగా ఉంటాయ‌ని అంచ‌నాలున్నాయి. మ‌ళ్లీ భార‌త్ లో క‌రోనా కేసులు పెర‌గ‌డంపై అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంది. 

కాగా గ‌త మూడో వేవ్ స‌మ‌యంలో కూడా ఇలాగే మొద‌ట ఢిల్లీలోనే కేసులు పెరుగుతూ వ‌చ్చాయి. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా ఆంక్ష‌లు విధించారు. గ‌త కొంత కాలం వ‌ర‌కు ఈ ఆంక్షలు కొన‌సాగాయి. మ‌ళ్లీ ఇప్పుడు దేశ రాజ‌ధానిలోనే కేసుల పెరుగుద‌ల క‌నిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు ప్రారంభించాయి. 

click me!