Coronavirus : కోవిడ్ టెన్ష‌న్.. ఢిల్లీలో క‌రోనాతో హాస్పిట‌ల్ లో చేరిన 14 మంది చిన్నారులు

By team telugu  |  First Published Apr 16, 2022, 1:55 PM IST

ఢిల్లీలో కరోనాతో శుక్రవారం ఒకే రోజు 53 మంది హాస్పిటల్ లో చేరారు. ఇందులో 14 మంది పిల్లలు ఉన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. 


కోవిడ్ మ‌ళ్లీ క‌ల‌వ‌రపెడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌న దేశంలో కూడా క‌రోనా కేసులు త‌గ్గాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లించారు. అయితే ఇటీవ‌ల కొంత కేసుల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. కొన్ని రోజుల కింద‌టే గుజ‌రాత్ లో క‌రోనా కొత్త  వేరియంట్ XE కేసు వెలుగులోకి వ‌చ్చింది. 

దేశ రాజ‌ధానిలో గ‌త కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కోవిడ్ -19తో 53 మంది హాస్పిట‌ల్ లో చేరారు. అయితే ఇందులో 14 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. హాస్పిట‌ల్ లో చేరిన చాలా మంది కోమోర్బిడీల‌ను క‌లిగి ఉన్నారు. ఈ పిల్ల‌ల్లో 12 మంది ఢిల్లీలోని కళావతి సరన్ హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇంత మంది పిల్ల‌లు హాస్పిటల్ లో చేరినా.. క‌రోనా సోకిన వారి వారి సంఖ్య పెరగలేదు.

Latest Videos

undefined

శుక్రవారం ఢిల్లీలో 3.95 శాతం పాజిటివ్ రేటుతో 366 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శుక్రవారం విద్యార్థులకు మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలల మూసివేత అనేది చివరి ఎంపిక అని పేర్కొంది. ‘‘ పాఠశాలలను మూసివేయడం చివరి ఎంపిక. అవసరమైతే పాక్షికంగా పాఠశాలలు మూసివేస్తాము’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
 

click me!