corona virus : కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే వ్యాక్సిన్ - కేంద్రం కొత్త నిబంధన

By team telugu  |  First Published Jan 22, 2022, 9:53 AM IST

కోవిడ్ -19 పాజిటివ్ గా తేలిన వ్యక్తులు కోలుకున్న మూడు నెల‌ల త‌రువాత మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. ఈ నిబంధ‌న‌లు  ప్రికాష‌న‌రీ (precutionary)డోసుతో స‌హా అన్ని మొద‌టి, రెండో డోసు కు కూడా వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లేఖ రాసింది.


దేశంలో కరోనా (corona) కలవరం సృష్టిస్తోంది. ఈ వైరస్ ను క‌ట్ట‌డి చేయ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప‌లు ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి. వీకెండ్ క‌ర్ఫ్యూ (weekend curfew), నైట్ క‌ర్ఫ్యూ (night curfew)లు విధిస్తున్నాయి. దీంతో పాటు స్థానిక ప‌రిస్థితులను బ‌ట్టి ఆంక్ష‌లు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రార్థ‌నాలయాల‌కు అనుమ‌తి నిషేదిస్తే.. మ‌రి కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ఆఫీసుల‌న్నీ క్లోజ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో హోట‌ళ్ల భోజ‌నం చేయడాన్ని నిషేదించి.. కేవ‌లం హోం డెలివ‌రీ (home delivery), పార్శిల్ (percil)సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నారు.

కోవిడ్ -19 (covid -19) క‌ట్ట‌డికి ఇలా ఆంక్ష‌లు అమ‌లు చేస్తూనే.. మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ (vaccination) కార్య‌క్ర‌మం వేగ‌వంతం చేస్తోంది. ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల‌కు 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant)విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి టీనేజ‌ర్ల‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. ఈ డ్రైవ్ కు చాలా స్పంద‌న వ‌స్తోంది. అలాగే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (covid front line wariars)కు, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు ప్రికాష‌న‌రీ డోసు కూడా అందిస్తోంది. ఈ డ్రైవ్  జ‌న‌వ‌రి 10వ తేదీన మొద‌ల‌య్యింది. 

Latest Videos

undefined

ఈ వ్యాక్సినేష‌న్ (vaccination)పై కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం కొత్త నిబంధ‌న పెట్టింది. కోవిడ్ -19 పాజిటివ్ గా తేలిన వ్యక్తి కోలుకున్న  మూడు నెల‌ల త‌రువాత మాత్ర‌మే వ్యాక్సిన్ ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ నిబంధ‌న‌లు  ప్రికాష‌న‌రీ (precutionary)డోసుతో స‌హా అన్ని మొద‌టి, రెండో డోసు కు కూడా వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లేఖ రాసింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి వికాస్ షీల్ మాట్లాడారు. కోవిడ్ -19 సోకిన వారికి ఇచ్చే వ్యాక్సినేష‌న్ విష‌యంలో అనేక వ‌ర్గాల నుంచి అభ్య‌ర్థ‌నలు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఎవ‌రికైనా కోవిడ్ -19 ప‌రీక్ష‌లో పాజిటివ్ గా తేలితే.. వారికి ఇచ్చే వ్యాక్సిన్ ను కోలుకున్న త‌రువాత మూడు నెలల పాటు వాయిదా వేయాల‌ని కోరుతున్నాన‌ని అన్నారు. ఈ నిర్ణ‌యం శాస్త్రీయ ఆధారాలు, ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సిఫార్సుపై ఆధారంగా తీసుకున్నామ‌ని తెలిపారు. 

ఇదిలా ఉండ‌గా.. కేంద్ర ప్ర‌భుత్వం పిల్లల మాస్క్ (masks)వాడకంపై కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్‌లు సిఫారసు చేయరాదని ప్రభుత్వం తెలిపింది. మాస్క్‌ను సురక్షితంగా, సముచితంగా ఉపయోగించ‌గలిగే 6-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సున్న పిల్ల‌లు మాస్క్ లు ధ‌రించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. అయితే 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పెద్దల మాదిరిగానే మాస్క్‌ను ధరించాల‌ని సూచించింది. అలాగే 18 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు యాంటీవైరల్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడకూడ‌ద‌ని చెప్పింది.

click me!