ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉంటుందని మహారాష్ట్ర కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ మెంబర్ డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. కోలుకున్న వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
దేశంలో కరోనా (corona) ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా రెండు వేవ్ లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆర్థిక పరిస్థితి దిగజారింది. అలాగే ఎంతో మంది ఉపాధిని కోల్పొయారు. మరెంతో మంది తమ ఆత్మీయులను కొల్పోయారు. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి.. మళ్లీ జన జీవనం గాడిలో పడుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ థర్డ్ వేవ్ వచ్చేసింది. ఢిల్లీ (delhi), ముంబాయి (mumbai)లో ఇప్పటికే ఈ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుకుంది.
కోవిడ్ -19 డెల్టా వేరియంట్ (delta veriant) తో పాటు దేశంలో కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ (omicron) కూడా విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో (south africa) మొదటగా ఈ వేరియంట్ గుర్తించినా.. అది అన్నీ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ ను 38 దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. ఇండియాలో దీనిని డిసెంబర్ (december) రెండో తేదీన కర్నాటక రాష్ట్రంలో మొదటి సారిగా కనుగొన్నారు. ఇప్పుడు దాదాపుగా ఈ వేరియంట్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ కు తక్కువ తీవ్రగ, స్వల్ప లక్షణాలే కలిగిస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది కొంత ఊరట కల్గించే అంశం అయినప్పటికీ.. దీని వల్ల ధీర్ఘకాలికంగా ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఈ ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉంటుందని మహారాష్ట్ర కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ (covid -19 taskforce) మెంబర్ అయిన డాక్టర్ శశాంక్ జోషి (doctor shashank jhoshi) తెలిపారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్న వ్యక్తులు తప్పకుండా సరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారు అయినప్పటికీ.. మళ్లీ సోకదని నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలిపారు. అందరిలాగే వారు కోవిడ్ కూడా కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అయితే, ఒమిక్రాన్ సోకిన వారు మళ్లీ ఈ వేరియంట్ బారిన పడినట్టు అధికారికంగా ఇప్పటి వరకు సమాచారం లేదని ఇదే కోవిడ్ -19 (covid -19) టాస్క్ ఫోర్స్ కు చెందిన మరో సభ్యుడు రాహుల్ పండిట్ (rahul pandith) తెలిపారు. కానీ అందరూ కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని నొక్కి చెప్పారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి వైవిధ్యాలు బయటపడుతాయో ఎవరికీ తెలియదని అన్నారు.కాబట్టి ఒమిక్రాన్ అయినా.. మరే SARS-CoV-2 వేరియంట్ అయినప్పటికీ.. ఇన్ఫెక్షన్ బారిన పడకూడదంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా..భారతదేశంలో 3,17,532 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇది గడిచిన 249 రోజులలో అత్యధికమైన కేసులు. మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 9,287 కు పెరిగాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,51,777 కోలుకున్నారు.