corona virus : ఒమిక్రాన్ తో ప్రమాదం లేదనే వార్తలను నమ్మొద్దు - ప్రపంచ ఆరోగ్య సంస్థ

By team teluguFirst Published Jan 19, 2022, 2:55 PM IST
Highlights

ఒమిక్రాన్ తో ప్రమాదం లేదనే వచ్చే వార్తలను నమ్మొద్దని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కొత్త వేరియంట్ స్వల్ప తీవ్రత కల్గి ఉన్నాయనే వార్తల వల్ల తప్పుడు సాంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు డబ్లూహెచ్ వో బుధవారం ప్రకటించింది. 

 

కోవిడ్ -19 (covid -19) కొత్త వేరియంట్ (new veriant) అయిన‌ ఒమిక్రాన్ తో ప్ర‌మాదం లేద‌ని, స్వ‌ల్ప తీవ్ర‌త క‌లిగి ఉంద‌నే వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (world health orgnigation) హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధ్య‌క్షుడు చీఫ్ టెడ్రోస్ అధనామ్ (tedros adhanom) ఘెబ్రేయేసస్ జెనీవా (geneva)లోని ప్రధాన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌థ ఇంకా ముగియ‌లేద‌ని, అది ఇంకా ఎక్క‌డికి పోలేద‌ని తెలిపారు. 

క‌రోనా వేరియంట్ ఒమిక్రాన్ (omicron)  గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో (south africa) మొదటిసారి క‌నుగొన్నార‌ని డ‌బ్లూహెచ్ వో (who) చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. అప్ప‌టి నుంచి ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించిందని ఆయ‌న చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ అనేది కోవిడ్-19 (covid -19) అత్యంత పరివర్తన చెందిన వేరియంట్ (veriant) అని, ఇది పాత వేరియంట్ల కంటే చాలా త‌క్కువ ఇన్ఫెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఈ కార‌ణాల వ‌ల్ల ఇక క‌రోనా మ‌హమ్మారి చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని శాస్త్ర‌వేత్లలు, నిపుణులు భావించారు. అయితే దీనిపై డ‌బ్లూహెచ్ వో చీఫ్ మాట్లాడారు. ఒమిక్రాన్ స్వ‌ల్ప తీవ్ర‌త‌ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఇది వేగంగా వ్యాపిస్తుంద‌ని తెలిపారు. కాబ‌ట్టి ఇది ఎక్కువ మందికి వ్యాపించడం వ‌ల్ల ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు చ‌నిపోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. 

ఒక వ్య‌క్తిలో ఈ వేరియంట్ చూపే ప్ర‌భావంతో సంబంధం లేకుండా విప‌రీత‌మైన కేసుల పెరుగుద‌ల వ‌ల్ల హాస్పిట‌ల్ లో చేరిక‌లు, మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంద‌ని డ‌బ్లూహెచ్ వో ఎమ‌ర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ (who emrgency director mickel ryan) మంగ‌ళ‌వారం మీడియాతో అన్నారు. ఈ విష‌యాన్ని డ‌బ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధ‌నామ్ ఒప్పుకున్నారు. ఓమిక్రాన్ సగటున తక్కువ తీవ్రతతో ఉండవచ్చు అని అన్నారు. అది నిజ‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ తేలిక పాటి వ్యాధి అనే వార్త‌లు పూర్తిగా త‌ప్పుదారి పట్టిస్తాయి అని హెచ్చ‌రించారు. ఇలాంటి త‌ప్పులు చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు. వీటి వ‌ల్ల హాస్పిట‌ల్ (hospital) లో చేరిక‌లు, మ‌ర‌ణాలు పెరుగుతాయ‌ని అన్నారు. త‌క్కువ తీవ్రమైన కేసులు కూడా ఆరోగ్య వ్య‌వస్థ‌పై ఒత్తిడి ప‌డేలా చేస్తాయ‌ని తెలిపారు. కొవిడ్ -19 (covid -19) కొత్త వేరియంట్ కేసులు కొన్ని దేశాల్లో పీక్ స్టేజికి చేరుకున్న‌ట్టు సూచ‌న‌లు ఉన్నాయ‌ని అన్నారు. 

ఈ ఒమిక్రాన్ వేరియంట్ తో (omicron veriant)ఈ కోవిడ్ -19 పూర్తిగా వెళ్లిపోతుంద‌నే ఆశ క‌నిపిస్తుంద‌ని, అయితే ఈ దేశం కూడా ఇంకా పూర్తి స్థాయిలో దీని నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని అన్నారు. ఇప్పుడే దీని నుంచి కోలుకున్నామ‌ని ప్ర‌క‌టించుకునే స‌మ‌యం కాద‌ని టెడ్రోస్ తెలిపారు. కోవిడ్ -19 వ‌ల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్ప‌టికీ ప్ర‌తీ వారం 45,000 మ‌ర‌ణాలు న‌మోదు చేస్తోంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన కోవిడ్ -19 టెక్నిక‌ల్ హెడ్ మ‌రియా వాన్ కెర్టోవో (technical head miriya kerdovo) అన్నారు. 
 

click me!