ఐదేళ్లు పైబడిన పిల్లలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ అప్పర్ చీసాపీక్ హెల్త్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం చీఫ్ డాక్టర్ ఫహీమ్ యూనస్ అన్నారు. ఇది మరణాల రేటును 90 శాతం తగ్గిస్తుందని చెప్పారు.
కోవిడ్ -19 (covid - 19) విజృంభిస్తోంది. అన్ని దేశాలు ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్నో వేవ్ లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. భారత్ లో కూడా రెండు వేవ్ లు ఎన్నో ఇబ్బందులకు గురి చేశాయి. ఎందరో మంది నిరుద్యోగులయ్యారు. మరెంతో మంది తమ ఆత్మీయులను కోల్పొయారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉపాధి కరువయ్యింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గి జనజీవనం గాడిలో పడుతుందనుకుంటున్న సమయంలో మళ్లీ మూడో వేవ్ (third wave) స్టార్ట్ అయ్యింది.
ఈ మూడో వేవ్ (third wave) లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్షన్నరపైనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడో వేవ్ లో కొత్త వేరియంట్ కలవరానికి గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ (veriant) ఇప్పుడు అన్నిదేశాలకు విస్తరిస్తోంది. ఇది మన దేశంలో కూడా డిసెంబర్ (decembar) రెండో తేదీన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో గుర్తించారు. ఈ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. దీని తీవ్రత, లక్షణాలు స్వల్పంగానే ఉన్నా.. ఇది ధీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
కరోనా (corona) నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ (vaccination) కార్యక్రమం వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల టీనేజ్ (teenage) పిల్లలను కూడా వ్యాక్సిన్ (vaccine) పరిధిలోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం 15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3వ (january 3rd) తేదీ నుంచి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే ఐదేళ్లు పైబడిన పిల్లలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ అప్పర్ చీసాపీక్ హెల్త్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం చీఫ్ డాక్టర్ ఫహీమ్ యూనస్ నొక్కి చెప్పారు. ఇది మరణాల రేటును 90 శాతం తగ్గిస్తుందని అన్నారు. "ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయాలని, టీకాలు సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డేటా అదే చెబుతోంది. వ్యాక్సిన్ లు పుష్కలంగా అందుబాటులో ఉంటే పిల్లలకు వ్యాక్సిన్ వీలైనంత త్వరగా ఇవ్వాలి’’ అని ఆయన తెలిపారు.
మహమ్మారి ప్రస్తుత దశలో తాము ఎక్కువ మంది పిల్లలను చూస్తున్నామని డాక్టర్ ఫహీమ్ యూనస్ తెలిపారు. అయితే ఈ వైరస్ పిల్లలకు ప్రాణాంతకం కాదని అన్నారు. అయితే పిల్లలకు వ్యాక్సిన్ (vaccine) వేయలేదని, అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) ఊపిరితిత్తులలోని దిగువ శ్వాసకోశంతో పోలిస్తే ఎగువ శ్వాసకోశానికి ఇన్ ఫెక్షన్ సోకుతుందని తెలుస్తోందని అన్నారు. అయితే పిల్లలు ఎదిగే క్రమంలో శరీర నిర్మాణపరంగా వారి ఎగువ శ్వాసకోశాన్ని కలిగి ఉంటారని తెలిపారు. దీని వల్ల ఎక్కువ మంది పిల్లలు హాస్పిటల్ లో (hospital) చేరుతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే పెద్దలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వారితో పోలిస్తే పిల్లల్లే కొంత మెరుగ్గా ఉన్నారని తెలిపారు.