బీకేర్ ఫుల్.. లక్షణాలు లేకున్నా ఆరుగురికి కరోనా

By telugu news team  |  First Published Apr 3, 2020, 11:09 AM IST

నల్లగొండ జిల్లా నుంచి మొదటి దశలో మర్కజ్‌ వెళ్లొచ్చిన 44 మందిని పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఆరుగురుకి పాజిటివ్‌ వచ్చింది. అయితే వారెవరికీ కూడా ఆ లక్షణాలు లేవని వైద్యాధికారులు చెప్పారు.


మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. గతేడాది చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ ప్రమాదకరంగా మారింది. ఇప్పటి వరకు కనీసం కొన్ని లక్షణాల ఆధారంగా కరోనా సోకిందో లేదో అనే నిర్థారణకు వచ్చే అవకాశం ఉండేది. అయితే.. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు లేకున్నా.. కరోనా పాజిటివ్ గా తేలుతోంది.

Also Read తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తున్న కరోనా: సూర్యాపేటలో తొలి కేసు నమోదు...

Latest Videos

కోవిడ్ పరీక్షలు నిర్వహించిన 14 మంది లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేకుండా, ఆరోగ్యంగా ఉన్నా కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పిన సంగతి తెలిసిందే. 

కాగా... ఇలాంటి సంఘటనే మరోటి తెలంగాణలోనూ చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నుంచి మొదటి దశలో మర్కజ్‌ వెళ్లొచ్చిన 44 మందిని పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఆరుగురుకి పాజిటివ్‌ వచ్చింది. అయితే వారెవరికీ కూడా ఆ లక్షణాలు లేవని వైద్యాధికారులు చెప్పారు.

కాగా.. ఈ న్యూస్ పలువురిని కలవరపెడుతోంది. కనీసం లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుందని.. అవి కూడా లేకపోతే పరిస్థితి మారింత దారుణంగా మారినట్లేనని స్థానికులు భయపడిపోతున్నారు. మరి దీనిపై నిపుణులు ఏమంటారో చూడాలి.

click me!