108 డాక్టర్ పై కత్తులతో దాడి... పరిస్థితి విషమం

By Sree sFirst Published Apr 6, 2020, 10:23 AM IST
Highlights

108 ఈఎంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

108 ఈఎంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అత్యవసర సేవలు అందించే అంబులెన్సు లో ఉండే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిరంజన్ నిద్రిస్తున్నాడు. 

ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన నిరంజన్కు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమంగా మారడంతో అతడిని హైదరాబాద్ కు తరలించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 

రాత్రి పూత కర్ఫ్యూ అమల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసును ఛాలెంజ్ గా గతీసుకున్నారు పోలీసులు. డ్యూటీ డాక్టర్ అందునా ప్రభుత్వ కార్యాలయంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును హై ప్రయారిటీ మీద దర్యాప్తు చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో ప్రకటించింది. ఈ కేసులతో కలుపుకొని తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 334కు చేరుకుంది. 

కరోనా బారినపడి ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందారని, 33 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని ఆ బులెటిన్ లో తెలిపారు. ఆసుపత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

హైదరాబాద్‌లో అత్యధికంగా 162 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరంగల్‌ అర్బన్‌ 23, నిజామాబాద్‌ 19, నల్లగొండ 13, మేడ్చల్‌ 12, ఆదిలాబాద్‌ జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. 

click me!