ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌కు కరోనా దెబ్బ...ఆచితూచి వ్యూహాత్మకంగా ముందుకు..

By Sandra Ashok Kumar  |  First Published May 4, 2020, 12:02 PM IST

గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు కూడా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ భారీగాపడింది. మార్కెట్లు పడిపోతున్నా బఫెట్ షేర్ల కొనుగోలు విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. తమ సంస్థ షేర్ల బై బ్యాక్ విషయంలోనూ వెనుకకు తగ్గారు.


వాషింగ్టన్‌‌: ప్రపంచ ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌, ఒరాకిల్‌ ఆఫ్‌ ఒమాహాగా పిలిచే వారెన్‌ బఫెట్‌కు సైతం కరోనా దెబ్బ చాలా గట్టిగానే తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఇంకా కనిష్ట స్థాయికి పడిపోలేదని సీనియర్‌‌‌‌ ఇన్వెస్టర్‌‌‌‌ వారెన్‌‌ బఫెట్‌‌ భావిస్తున్నట్లు ఉన్నారు. కొన్ని కంపెనీలలో ఆయనకు ఉన్న ఈక్విటీ షేర్లను అమ్మేసి డబ్బులను సమీకరిస్తున్నారు. కానీ వీటితో తిరిగి షేర్లను వారెన్ బఫెట్ కొనడం లేదు. 

వారెన్ బఫెట్ తన కంపెనీకి చెందిన షేర్లను బై బ్యాక్‌‌ చేయడం నుంచి కూడా వెనక్కి తగ్గారు. మార్చి చివరికల్లా ఆయన 137 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఏప్రిల్‌‌ నెలలో మరో 6 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.

Latest Videos

తన దగ్గర డబ్బులున్నా గత  నెలలో కేవలం 1.8 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లే వారెన్ బఫెట్ తిరిగి కొనుగోలు చేశారు. ఎయిర్‌‌‌‌లైన్‌‌ షేర్లను వదిలించుకుంటున్నారు. కాగా కరోనా దెబ్బతో అమెరికా స్టాక్‌‌ మార్కెట్లు భారీగా నష్టపోతున్న సంగతి తెలిసిందే.

దీంతో క్వాలిటీ స్టాకులన్ని ఆకర్షణీయంగానే కనిపిస్తున్నా వారెన్ బఫెట్ ఇతర సంస్థల షేర్లను కొనడం లేదు. మార్కెట్లు పతనమైనప్పుడు అడ్వాంటేజ్‌‌ తీసుకోమని ఇన్వెస్టర్లకు బఫెట్‌‌ సలహా ఇస్తారని ఓ ఎనలిస్ట్‌‌ చెప్పారు. మార్కెట్లు పడుతున్న టైమ్‌‌లో మిగిలిన వారు భయపడుతుంటే మనం ఆశపడాలని చెబుతుంటారని అన్నారు.

also read  ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థ రికవరీ... ఈలోగా ఉద్యోగాలు గల్లంతే!

మరోవైపు కోవిడ్‌ కల్లోలంలో బఫెట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వేకు చెందిన స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విలువ భారీగా పతనమైంది. దాంతో కంపెనీ రికార్డు నష్టాలను నమోదు చేసుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో దాదాపు 5,000 కోట్ల డాలర్ల నికర నష్టం ప్రకటించాల్సి వచ్చింది. అంటే, భారత కరెన్సీలో రూ.3.75 లక్షల కోట్ల పైమాటే.

అమెరికా అకౌంటింగ్‌ నిబంధనల ప్రకారం.. బెర్క్‌షైర్‌ తన పెట్టుబడును ఇంకా ఉపసంహరించుకోని షేర్లలో వచ్చిన నష్టాలను సైతం ఆర్థిక ఫలితాల్లో నివేదించాలి. సమీక్షా కాలానికి కంపెనీ స్టాక్‌ పెట్టుబడుల నష్టం 5,452 కోట్ల డాలర్లుగా నమోదైంది.

ముఖ్యంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వెల్స్‌ ఫార్గో, నాలుగు ఎయిర్‌లైన్స్‌ (అమెరికన్‌, డెల్టా, సౌత్‌వెస్ట్, యునైటెడ్‌) షేర్లలోని పెట్టుబడులకు భారీగా గండి పడింది. తత్ఫలితంగా గత త్రైమాసికానికి 4,975 కోట్ల డాలర్ల నికర నికర నష్టం ప్రకటించాల్సి వచ్చిందని బెర్క్‌షైర్‌ వెల్లడించింది. అయితే, ఈ నిబంధనతో బఫెట్‌ ముందు నుంచి విబేధిస్తూ వచ్చారు.

కంపెనీ పనితీరును అంచనా వేసేందుకు నికర లాభానికి బదులు నిర్వహణ లాభాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారెన్ బఫెట్ అంటారు. మార్చి త్రైమాసికంలో బెర్క్‌షైర్‌ హాత్‌వే నిర్వహణ లాభం 6 శాతం వృద్ధి చెంది 587 కోట్ల డాలర్లుగా నమోదైంది. 

click me!