అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్ -1 బి వీసాదారులకు గుడ్ న్యూస్...

By Sandra Ashok Kumar  |  First Published May 2, 2020, 7:38 PM IST

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సడలింపులు వచ్చాయి, ఇది గత డిసెంబర్‌లో చైనా వుహాన్ నగరంలో కరోనావైరస్  మొదటి కేసు నమోదైంది. ఇప్పటివరకు, ఈ వైరస్ వల్ల యు.ఎస్ లో 65,000 మందికి పైగా మరణించగా, ప్రపంచవ్యాప్తంగా 2,35,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


వాషింగ్టన్: కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట కలిగించింది. వివిధ సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసులు అందించిన హెచ్ -1 బి వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ ప్రభుత్వం 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ శుభవార్త అందించింది. 

దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో  గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి  రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు.

Latest Videos

శుక్రవారం నాటి యుఎస్‌సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది.

అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది.  గడువు  ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్‌సీఐఎస్  తెలిపింది.


కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సడలింపులు వచ్చాయి, ఇది గత డిసెంబర్‌లో చైనా వుహాన్ నగరంలో కరోనావైరస్  మొదటి కేసు నమోదైంది. ఇప్పటివరకు, ఈ వైరస్ వల్ల యు.ఎస్ లో 65,000 మందికి పైగా మరణించగా, ప్రపంచవ్యాప్తంగా 2,35,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ట్రావెల్ లక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్వదేశానికి తిరిగి రావాలని కోరుకునే భారతీయ పౌరుల కోసం  యుఎస్ లోని భారత రాయబార కార్యాలయం సంప్రదించడం ప్రారంభించింది.


పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయం వెలువడింది. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10 న ప్రభుత్వం తెలిపింది.

click me!