కరోనా వైరస్ సోకిన వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో, క్వారంటైన్‌లో ఉండేవారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా రోడ్లపై ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతుండటంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో, క్వారంటైన్‌లో ఉండేవారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా రోడ్లపై ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతుండటంతో ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నారు.
వీరు తమ ప్రాణాలతో పాటు తోటి వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టిస్తున్నారు. తమకు కరోనా సోకిందన్న విషయాన్ని దాచిపెడుతూ..సన్నిహితులకు, కుటుంబసభ్యులకు ఈ వైరస్ సోకింపజేస్తున్నారు. దీంతో ఆరోగ్యవంతులైన కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు.
Also Read:తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కరోనా కేసులు, ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్: కేసీఆర్
పంజాబ్‌లో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. కొద్దిరోజుల క్రితం ఓ 70 ఏళ్ల పంజాబ్ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి, కరోనాతో అట్టుడుకుతున్న ఇటలీ, జర్మనీ దేశాల్లో రెండు వారాల పాటు పర్యటించి భారతదేశంలోకి అడుగుపెట్టాడు.
విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. పక్కవారి ఆరోగ్యం ఏమైతే నాకేంటి అన్నట్టు భారత్‌కు వచ్చినప్పటి నుంచి సుమారు 100 మందిని కలిసి, 15 గ్రామాలను సందర్శించి ఈ నెల 18న ఆసుపత్రిలో మరణించాడు.
కరోనాతో కారణంగా చనిపోయిన ఆయన ట్రావెల్ హిస్టరీని అధికారులు సేకరించగా సుమారు 23 మందికి కరోనా లక్షణాలను అంటించినట్లుగా తెలిసింది. మార్చి 8, 10 తేదీల మధ్య ఆనందపూర్ సాహిబ్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల సందర్భంగా మృతుడు కలిశాడు.
Also read:కరోనా భయం: పట్టించుకోని బంధువులు.. అందరూ ఉన్నా చెత్తబండిలో అనాథ శవంలా
అక్కడి నుంచి షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామానికి, అనంతరం 15 గ్రామాల్లో తిరిగినట్లు తేలింది. ఇతని నిర్వాకం ఫలితంగా ఆయన కుటుంబంలోని 14 మందికి కరోనా సోకిందట.
మరణించిన వ్యక్తి సందర్శించిన 15 గ్రామాలను సీల్ చేసి, 23 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈయనతో కాంటాక్ట్‌లో ఉన్న సుమారు 100 మంది ఎవరా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.