కరోనా: హోం క్వారంటైన్ నుండి హోం టౌన్‌కు జంప్, ఐఎఎస్‌పై కేసు

By narsimha lode  |  First Published Mar 27, 2020, 3:55 PM IST

:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ లను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అధికారులే నిబబంధనలను తుంగలో తొక్కుతున్నారు. 



తిరువనంతపురం:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ లను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అధికారులే నిబబంధనలను తుంగలో తొక్కుతున్నారు. 

ఓ యువ ఐఎఎస్ అధికారి హోం క్వారంటైన్ ను వీడి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ ఘటనపై  విచారణ జరుపుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు.అంతేకాదు ఈ ఘటనపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Latest Videos

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుపమ్ మిశ్రా కేరళ రాష్ట్రంలలోని కొల్లాం జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సెలవులపై విదేశాలకు వెళ్లాడు. విదేశాల నుండి ఈ నెల 18వ తేదీన మిశ్రా స్వదేశానికి తిరిగి వచ్చాడు. అదే రోజున విధుల్లో చేరాడు.

విదేశాల నుండి వచ్చిన వారంతా కచ్చితంగా స్వీయ నిర్భంధంలో ఉండాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందులో భాగంగానే కొల్లాం కలెక్టకర్ అబ్దుల్ నజీర్ కూడ సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాను హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు.

also read: కరోనా ఎఫెక్ట్: రెపో రేటు 4.40%తగ్గింపు, 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం...

అయితే గురువారం నాడు అనుపమ్ మిశ్రా అధికారిక నివాసానికి వెళ్లిన పని మనుషులకు సబ్ కలెక్టర్ కన్పించలేదు. దీంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. సబ్ కలెక్టర్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. తన స్వంత గ్రామానికి ఆయన వెళ్లినట్టుగా సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ మీడియాకు చెప్పారు. 

ఈ విషయమై విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. స్వగ్రామానికి వెళ్లే విషయమై కనీసం తమకు సమాచారం కూడ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా కలెక్టర్ ప్రకటించారు.ఈ ఘటన విచారించదగిందిగా కలెక్టర్ అభిప్రాయపడ్డారు. 

దేశంలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల నుండి వచ్చిన వారి నుండే ఈ కేసులు నమోదు అవుతున్నట్టుగా చెబుతున్నారు. 

అయితే ఈ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్న సమయంలో సబ్ కలెక్టర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా  మారింది.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

click me!