కరోనా కాటు.. నిండు గర్భిణీ బలి

By telugu news team  |  First Published Apr 7, 2020, 11:18 AM IST

ఆమెకు కరోనా లక్షణాలు ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స అందించారు. వెనువెంటనే కరోనా పరీక్షలు కూడా చేశారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది.


కరోనా వైరస్ కాటుకి నిండు గర్భిణీ బలయ్యింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయిలోని నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సదరు మహిళను కుటుంబసభ్యులు బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో చేర్పించారు.

Also Read సెప్టెంబర్ వరకు లాక్ డౌన్..? సోషల్ మీడియాలో న్యూస్ వైరల్...

Latest Videos

కాగా... ఆమెకు కరోనా లక్షణాలు ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స అందించారు. వెనువెంటనే కరోనా పరీక్షలు కూడా చేశారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది.

అయితే.. చికిత్స అందిస్తుండగానే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడం గమనార్హం. దీంతో సదరు గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె కడుపులో బిడ్డ కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ హాస్పిటల్ కి తీసుకురావడానికి ముందు రెండు ఆస్పత్రులకు తీసుకుపోగా.. వాళ్లు సదరు మహిళను చేర్పించుకోవడానికి నిరాకరించడం గమనార్హం. కాగా మహిళ మృతి పట్ల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కరోనా తో చనిపోవడంతో కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

click me!