భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, 24 గంటల్లోనే 472 కేసులు నమోదు

By Sree s  |  First Published Apr 5, 2020, 11:17 AM IST

కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 77 మంది మరణించారని ఆరోగ్య శాఖా ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదయ్యాయని, వీటితో కలుపుకొని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,374 కు చేరింది. 


కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంపై పంజా విసురుతోంది. భారతదేశంలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల పుణ్యమాని ఈ వైరస్ ఇప్పుడు దేశమంతా విస్తరించింది. 

ఈ కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 77 మంది మరణించారని ఆరోగ్య శాఖా ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదయ్యాయని, వీటితో కలుపుకొని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,374 కు చేరింది. 

Latest Videos

ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వల్ల దేశంలో అత్యధికంగా శుక్రవారం రోజున కేసులు నమోదయ్యాయి. అదే రోజు అత్యధిక మరణాలు కూడా నమోదవ్వడం బాధాకరం. 

గత నెలలో తబ్లీగి జమాత్ కార్యక్రమానికి హాజరయినవారిలో దాదాపుగా 1000 మంది కరోనా పోసేతువే గా తేలినట్టు అధికారులు తెలిపారు. ఇకపోతే తెలంగాణలో కూడా ఈ వైరస్ విలయ తాండవం చేస్తుంది. 

రాష్ట్రంలో శనివారంనాడు 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 33కు చేరుకుంది. 

తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 11 మంది మరణించారు. నిజామాబాద్ లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మరణించారు. దీంతో ఆ వ్యక్తి శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. శనివారంనాడు అత్యధికంగా హైదరాబాదులోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులు ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం.

హైదరాబాదు జిల్లాలో 22 మంది, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు కరోనా వైరస్ పాజిటివ్ తో బాధపడుతున్నారు. హైదరాబాదు నారాయణగుడాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 48 మంది అతడి సన్నిహితులను, కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు. దిల్ సుఖ్ నగర్ లో ఒక్కరికి, మచ్చబొల్లారం, హఫీజ్ పేటల్లో ఇద్దరికి, మియాపూర్ లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

ఆదిలాబాద్ జిల్లాలో శనివారంనాడు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. జిల్లా నుంచి మర్కజ్ కు వెళ్లిన 70 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్ కు పంపించారు. వారందరి నమూనాలను పరీక్షలకు పంపించగా, ఉట్నూరుకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

నల్లగొండ జిల్లాలో తాజాగా మరో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. జగిత్యాల జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వికారాబాద్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ధ్రువీకరించారు. 

click me!