ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు.
కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉదయం ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని కోరారు.
రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు.
ప్రధాని పిలుపు ఇస్తే ఎలా ఉంటుందో జనతా కర్ఫ్యూ రోజు మనమంతా చూసాము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలందరూ పాటిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ, ప్రజలు గనుక ఇలా ప్రధాని పిలుపును పాటిస్తే అసలుకే ముప్పు వస్తుందంటూ విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read:జగన్ కొరడా: ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులపై ఎస్మా ప్రయోగం
దీపాలు వెలిగించడం వల్ల వారికి ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ... ఇంట్లోని లైట్లన్నీ కట్టేస్తే.... గ్రిడ్ మీద ప్రభావం చూపుతుంది. లోడ్ అంతా డౌన్ అయితే గ్రిడ్ షట్ డౌన్ కి దారి తీస్తుంది. ఉత్పత్తయిన విద్యుత్ ని పంపకం చేసినప్పుడు ఎవ్వరు వాడకపోతే గ్రిడ్ పూర్తిగా షట్ డౌన్ అవుతుంది.
పోనీ వేరే గ్రిడ్ కయినా ట్రాన్స్ఫర్ చేద్దామా అంటే... దేశమంతా ఇలానే ఆఫ్ చేస్తారు అందువల్ల గ్రిడ్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఇలా గనుక చేస్తే 15 నుంచి 16 గంటలపాటు గ్రిడ్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
ఒకే మారు లోడ్ ని తగ్గియలేరు. అది చేయాలాఅంటే... దాదాపుగా ఒక గంట ముందు నుంచే లోడ్ షెడ్డింగ్ ఆరంభించవలిసి ఉంటుంది. అంటే 8 గంటలా నుంచి నెమ్మది నెమ్మదిగా పవర్ కట్స్ మొదలుపెట్టాలి.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఫ్రీ గవర్నింగ్ మోడ్ లో ఉంచి విద్యుత్ ఉత్పాదనను సాధ్యమైనంత మేర తగ్గించమని చెప్పాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 3000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుందని అంచనా.
ఒక్క రాష్ట్రంలోనే ఇలా 3000 మెగావాట్ల అంటే... దేశం మొత్తంలో ఊహించవచ్చు. రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కనీసం ఉదయం వరకు ఇళ్లలో కరెంటు ఉండదు.
ఇలా కరెంటు గనుక ఆగిపోతే, ప్రజల తీవ్రమైన కష్టాలు పడుతారు. ప్రజల కష్టాలు అటుంచితే... 24 గంటలు ఇప్పుడు ప్రజల అవసరాల కోసం పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల మీద అదనపు భారం పడుతుంది. కరోనాపై జరుపుతున్న అలుపెరుగని పోరాటానికి కూడా ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. రోడ్లపైన లైట్ల నుండి ఆసుపత్రుల్లోని ఐసీయూల వరకు అన్నిటికి ప్రమాదం పొంచి ఉంది.