సత్య నాదెళ్ల సంచలనం: పర్మినెంట్ ‘వర్క్ ఫ్రం హోం’తో మెంటల్ హెల్త్ గాయబ్..

By Sandra Ashok Kumar  |  First Published May 19, 2020, 10:13 AM IST

ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందించేందుకు అవకాశాల్లేవని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అలా చేస్తే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సామాజిక బంధాలు  ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి వెళ్లడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


న్యూయార్క్: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ‘వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచే సేవలు)’ అందిస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థ దాకా ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు అనుమతిస్తున్నాయి. కానీ సత్య నాదెళ్ల మాత్రం ఐటీ సిబ్బంది శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తోసి పుచ్చారు. దీని వల్ల ఉద్యోగుల్లో అనేక దుష్పరిణామాలు ఉంటాయని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం ఎలా, వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని సత్య నాదెళ్ల ప్రశ్నించారు. రిమోట్ గా పనిచేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు.  

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగులకే ఎక్కువ ప్రమాదం వుంటుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ముఖ్యంగా  ఉద్యోగులు సమాజంలో కలవలేని పరిస్థితులు వస్తాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. దీని వల్ల కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.

also read రికార్డు స్ధాయిలో భగ్గుమన్న బంగారం ధరలు...10 గ్రాముల ధర..?

సమావేశాల్లో పాల్గొనేటప్పుడు భౌతికంగా కలవడానికి, ఆన్‌లైన్‌లో వర్చువల్ వీడియో  కాన్ఫరెన్సుల ద్వారా కలవడానికి చాలా తేడా ఉంటుందని సత్య నాదెళ్ల చెప్పారు. భౌతిక, వ్యక్తిగత సమావేశాల ప్రయోజనాలను ఇవి భర్తీ చేయ లేవన్నారు.

అంతేకాదు అంతా రిమోట్ సెటప్ గా మారిపోవడం అంటే.. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి జారి పోవడమేనని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.  కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విటర్ కూడా ముందుకొచ్చింది. 

ప్రధానంగా మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత కూడా తన సిబ్బందికి ఇంటినుండి 'ఎప్పటికీ' పనిచేసుకోవచ్చనే అవకాశాన్ని ట్విటర్ ప్రకటించిన తరువాత సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అక్టోబర్ వరకు పొడిగించింది.

click me!