లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అయితే పలు విద్యా సంస్థలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు భారత్ లో ఐదువేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే... ఈ లాక్ డౌన్ వేళ కొందరు మాత్రమే లాభపడ్డారు. వారే ఆన్ లైన్ కంపెనీలు.
Also Read మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా కేసులు..64మరణాలు...
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అయితే పలు విద్యా సంస్థలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఐటీ సంస్థ బ్లిస్ మార్కామ్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు ఆన్‌లైన్ కంపెనీలకు భారీ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అలాగే పలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇ-లెర్నింగ్‌ను అమలు చేసేందుకు యోచిస్తున్నారు.
రాబోయే రోజుల్లో లాక్డౌన్ తర్వాత ఇ-లెర్నింగ్ విద్య విధానం అమలుకావచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇ-లెర్నింగ్ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.