డోర్ డెలివరీపై మారుతి కేంద్రీకరణ... 12 నుంచి ఉత్పత్తి మొదలు...

By Sandra Ashok Kumar  |  First Published May 7, 2020, 10:17 AM IST

కరోనా ‘లాక్‌డౌన్‌’ నిబంధనలను సడలించిన దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బుధవారం కార్యకలాపాలు ప్రారంభించింది. 600 డీలర్‌షిప్‌‌లు తెరుచుకున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ ఆర్డర్లు పొందుతున్న మారుతి.. వినియోగదారుల ఇంటికే కార్లు డెలివరీ చేయనున్నది. ఇందుకోసం సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేసింది.
 


ముంబై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) కార్యకలాపాలను బుధవారం తిరిగి ప్రారంభించింది. కరోనావైరస్, లాక్‌డౌన్‌ మూసివేసిన 600 డీలర్‌షిప్‌లను తెరిచినట్లు తెలిపింది. 

ఇప్పటికే దేశంలోని మారుతి సుజికి ఉద్యోగుల కు వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందు బుక్‌ చేసుకున్న వారికి వాహనాలను అందించే పనిని కూడా మారుతి సుజుకి ప్రారంభించింది. ఆర్డర్లు బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికే వాహనాలను అందించే పనిలో మారుతి సుజుకి ఉంది. 

Latest Videos

దీనికి సంబంధించిన స్టాక్ తమ దగ్గర వుందని మారుతి సుజుకి తెలిపింది. కార్ల ఉత్పాదక ప్లాంట్ల కార్యకలాపాలు ప్రస్తుతానికి ఇంకా మొదలుకాలేదని ప్రకటించింది. ఈ నెల 12న హర్యానాలోని మానెసర్ ఉత్పాదక యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది. 

కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాహనాల కొనుగోలుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేశామని  తెలిపింది. అలాగే డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని ఆటో మేజర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తెరిచామని మారుతి సుజుకి  మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. 

also read  

కొన్ని రోజులుగా 55 యూనిట్లతో ఇప్పటికే కార్ల డెలివరీలను కంపెనీ ప్రారంభించిందని మారుతి సుజుకి  మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. సంబంధిత అనుమతులు తప్పనిసరైన రాష్ట్రాల్లో డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 

మొత్తం అమ్మకపు నెట్‌వర్క్‌లో కార్యకలాపాలను ప్రారంభంపై ప్రశ్నించినపుడు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎంత త్వరగా ఆమోదం వస్తుందనే దానిపై ఆధారపడి వుంటుందని మారుతి సుజుకి  మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. 

కరోనా కట్టడికి సంబంధించి పూర్తి భద్రత, పరిశుభ్రత, శానిటైజేషన్ చర్యలను విధిగా అమలు చేస్తున్నామని మారుతి సుజుకి  సీఎండీ కెనిచి ఆయుకావా వెల్లడించారు. కొనుగోలు సమయలో షోరూమ్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు సహాయపడేలా డిజిటల్ ప్రక్రియను కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు.

వాహనాల డెలివరీకి కూడా షోరూమ్‌లకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేసినట్టు మారుతి సుజుకి  సీఎండీ కెనిచి ఆయుకావా తెలిపారు. అంతేకాక డీలర్‌షిప్‌లు టెస్ట్ డ్రైవ్ వాహనాలను పూర్తి స్టెరిలైజేషన్‌ను చేపడతాయని చెప్పారు.

కాగా దేశంలోని 1960 నగరాలు, పట్టణాల్లో సుమారు 3080 డీలర్‌షిప్‌లు ఉన్న ఈ సంస్థ 474 అరేనా అవుట్‌లెట్‌లు, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అమ్మకపు దుకాణాలను తెరవగలిగింది. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది. 

click me!