హెచ్1-బీ వీసాదారులకి షాకింగ్ న్యూస్... అమెరికా సంస్థ వెల్లడి

By Sandra Ashok Kumar  |  First Published May 6, 2020, 1:30 PM IST

అమెరికాలో హెచ్1-బీ వీసాదారులతో పని చేస్తున్న వలస కార్మికులకు స్థానిక మధ్యస్థ వేతనాల కంటే తక్కువగా అంటే లెవెల్-1, లెవెల్ 2 వేతనాలు ఇస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన అధ్యయన నివేదిక పేర్కొంది. కేవలం 18 శాతం మందికి మాత్రమే లెవెల్-3 అంటే సరైన వేతనాలే ఇవ్వాలని వెల్లడించింది.
 


వాషింగ్టన్: అమెరికాలో గల అత్యధిక టెక్ దిగ్గజాలు, ఇతర సంస్థలు.. హెచ్2 బీ వీసాదారులకు మార్కెట్‌లో సాధారణ వేతనాలతో పోలిస్తే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు తేలింది. టెక్నాలజీ, సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ సైతం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయని తెలిపింది.

‘హెచ్-2బీ వీసాస్ అండ్ ప్రివెయిలింగ్ వేజ్ లెవెల్స్’ పేరిట ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెల్లడయ్యాయి. హెచ్-1 బీ వీసాదారుల్లో 60 శాతం మంది స్థానిక మధ్యస్థ వేతనం (లోకల్ మీడియన్ వేజ్) కంటే తక్కువ వేతనం పొందుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

Latest Videos

దిగ్గజ సంస్థలు కూడా మీడియన్ వేజ్ కంటే తక్కువగా ఉండే లెవెల్-1, లెవెల్-2 వేతనాలే ఇస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది. దీనికి ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్’ హెచ్-1 బీ వీసా నిబంధనలు సైతం దీనికి అనుమతినిస్తున్నట్లు పేర్కొన్నది.

also read నలుగురిలో ఒకరు నిరుద్యోగి.. కరోనాతో ముంచుకొస్తున్న ఉద్యోగ భద్రత..

హెచ్-1 బీ వీసాదారులకు అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న తొలి 30 కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల ఎంపికలో ‘ఔట్ సోర్సింగ్’ విధానాన్ని అవలంభిస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. అయితే టెక్నాలజీ కంపెనీలు మాత్రం నేరుగా ఉద్యోగ నియామకాలు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా, లెవెల్-1, లెవెల్-2 విధానాన్ని అవలంభిస్తున్నాయి.

గతేడాది ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఎంపిక చేసుకున్న ఉద్యోగుల్లో 35 శాతం మందికి లెవెల్-1తోపాటు లెవెల్-2 స్థాయి వేతనాలు 42 శాతం మందికి ఆఫర్ చేసిందని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వివరించింది. 

కానీ అక్కడి స్థానిక మధ్యస్థ వేతనంగా సమానంగా ఉండే లెవెల్-3 వేతనం కేవలం 18 శాతం మందికి మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొన్నది.  అమెజాన్, ఆపిల్, ఫేస్ బుక్, ఉబర్ సంస్థలు కూడా ఇదే తరహా వేతనాలు ఇస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. 
 

click me!