దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 32 శాతం ఉత్పత్తిని తగ్గించి వేసింది. మరోవైపు కరోనా నేపథ్యంలో హ్యండాయ్ మోటార్స్ దేశవ్యాప్తంగా ‘క్లిక్ టు బై’ పేరిట ఆన్ లైన్ కార్ల బుకింగ్ స్కీం అమలు చేపట్టింది.
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఉత్పత్తిని భారీగా తగ్గించి వేసింది. గతంలో ఆర్థిక మందగనమంతోపాటు బీఎస్-6 ట్రాన్సిషన్ ప్రభావంతో అమ్మకాల్లేక ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో మార్చి నెల తయారీలో 32.05 శాతం కోత పెట్టినట్లు వెల్లడించింది.
ప్యాసింజర్ వాహనాల తయారీ ఇలా కుదింపు
మార్చి మొత్తంలో 92,540 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు మారుతి సుజుకి తెలిపింది. అదే గత సంవత్సరం మార్చిలో 1,36,201 యూనిట్లు తయారు చేసినట్లు పేర్కొంది. 2019 మార్చిలో 1,35,236 యూనిట్ల ప్యాసెంజర్ వాహనాలు ఉత్పత్తి చేసిన సంస్థ దాన్ని ఈ యేడాది 91,602 యూనిట్లకు పరిమితం చేసింది.
undefined
మినీ, కంపాక్ట్, యుటిలిటీ వాహనాల్లో కోత
అలాగే మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లు ఆల్టో, ఎస్-ప్రెస్సో, వేగనార్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ ఉత్పత్తిని 98,602 నుంచి 67,708కి కుదించి వేసింది. యుటిలిటీ వాహనాలైన విటారా బ్రెజా, ఎర్టిగా, ఎస్-క్రాస్ తయారీని కూడా 14.19 శాతం తగ్గించింది. ఫిబ్రవరిలో మొత్తం ఉత్పత్తిని 5.38 శాతం తగ్గించిన విషయం తెలిసిందే.
also read మారుతి మరో సరికోత్త రికార్డు.. గడువుకు ముందే అత్యధిక బీఎస్-6 కార్ల సేల్స్
ఆన్‌లైన్‌లో ‘హ్యుండాయ్’ కార్ల బుకింగ్!
దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశంలో కార్ల విక్రయానికి ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకున్నది. ‘క్లిక్ టు బై’ ఫ్లాట్‌ఫామ్‌కు దేశంలోని 500 సేల్స్ పాయింట్లను అనుసంధానిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా రిటైల్ ఖాతాదారులను సేవలందిస్తామని తెలిపింది.
తొలుత ఢిల్లీ పరిధిలో ప్రయోగాత్మకంగా ‘క్లిక్ టు బై’
ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని కొంత మంది డీలర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్ లైన్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. న్యూ క్రెటా, వెర్నాలతోపాటు అన్ని హ్యుండాయ్ మోడల్ కార్లను క్లిక్ టు బై వెబ్ సైట్ ద్వారా ఖాతాదారులు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
కస్టమర్ల ఆప్షన్లకు అనుగుణంగా డెలివరీ
హ్యుండాయ్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ ‘వినియోగదారులకు ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డెలివరీ ఆప్షన్ కూడా వినియోగదారుల ఇష్టం’ అని తెలిపారు.