కరోనా ఎఫెక్ట్: ట్యాక్స్ పేయర్స్‌కు ఐటీ శాఖ గుడ్‌న్యూస్

By Siva Kodati  |  First Published Apr 8, 2020, 6:35 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధికంగా ఇబ్బందులు  పడుతున్న దేశ ప్రజలకు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కంట్యాక్స్ రిఫండ్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా దేశంలో 14 లక్షల మందికి లబ్ధి కలగనుంది. 
 


కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధికంగా ఇబ్బందులు  పడుతున్న దేశ ప్రజలకు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌కంట్యాక్స్ రిఫండ్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

తద్వారా దేశంలో 14 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రూ.5 లక్షల లోపు ఐటీ రిఫండ్స్‌‌ వెంటన విడుదలకానున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కరోనా వైరస్ దృష్ట్యా వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Latest Videos

జీఎస్టీ, కస్టమ్స్ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.18 కోట్లు రిఫండ్ కింద విడుదల చేయనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 

click me!