ఫ్లాష్..ఫ్లాష్: ట్రంప్ కీలక ప్రకటన...చమురు ధరలు డౌన్, స్టాక్ మార్కెట్లు భారీ పతనం...

By Sandra Ashok KumarFirst Published Apr 21, 2020, 12:35 PM IST
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ వీడటం లేదు. కరోనా మహమ్మారి ప్రభావంతో వాడకం తగ్గిపోయిన ముడి చమురు ధర చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోగా, తాత్కాలికంగా వలసల్ని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. 
 

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ముంచేస్తున్నది. ముడి చమురు ధరలు చారిత్రక కనిష్ట స్థాయికి భారీస్థాయిలో పతనం కావడం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్  ఆరంభించాయి. 

దీనికి తోడు తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ గత రెండు సెషన్ల లాభాలను కోల్పోయాయి.

దీంతో  సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 91 వందల స్థాయిని కోల్పోయి నెగెటివ్ జోన్ లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. 

ముఖ్యంగా  బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో  సెన్సెక్స్ , నిఫ్టీ నెగెటివ్ జోన్ లోకి  జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. 

ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోయి, 30744, నిఫ్టీ 9000 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మినహా అన్ని స్టాక్స్ నష్టాలనే చవి చూస్తున్నాయి.

also read కరోనా వైరస్‌ వ్యాక్సిన్... హైదరాబాదీ భారత్ బయోటెక్‌కు నిధులు...

గెయిల్, హిందాల్కో, వేదాంతా,  బజాజ్ ఫైనాన్స్, ఓఎన్ జీసీ,టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి,  టాటా మోటార్స్, జెఎస్ డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. 

నిఫ్టీ బ్యాంకు  3.5 శాతం క్షీణించి 20 వేల దిగువకు చేరగా,  ఫార్మా, ఎఫ్ఎంసీజీ భారీ నష్టాలనుంచి స్వల్పంగా  పుంజుకుంటున్నాయి. యూఎస్ ఎఫ్ డీఏ అనుమతులతో అరబిందో ఫార్మా  దాదాపు 10 శాతం లాభపడుతోంది. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీలు ఒకశాతానికి పైగా లాభంతో ఉన్నాయి.

ఓఎన్ఝీసీ, ఇండస్ ఇండ్ షేర్లు ఆరు శాతం వరకు నష్టపోయాయి. గోద్రేజ్, డీఎల్ఎఫ్ మూడు శాతం చొప్పున పతనం అయ్యాయి. క్యూ4 ఫలితాల్లో అదరగొట్టిన ఇన్ఫీ షేర్ సైతం నాలుగు శాతం కోల్పోవడం ఆసక్తి కర పరిణామం. 

బీఎస్ఈ ఫైనాన్స్ ఇండెక్స్, ఆటో 4 శాతం చొప్పున నష్టాల పాలయ్యాయి. ఆటో ఇండెక్సులో మారుతి సుజుకి 5.8 శాతం షేర్ కోల్పోయింది. హ్యుండాయ్, టాటా మోటార్స్ దాదాపు 5.7 శాతానికి పైగా నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా ఆరు శాతం నష్టపోయింది. 

మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 76.80 వద్దకు పడిపోయింది. వొడాఫోన్ ఐడియా, యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఇండియా బుల్స్ హౌసింగ్ పైనాన్స్, వేదాంత ఎన్సీసీ షేర్లు పతనం అయ్యాయి. 
 

click me!