ఇంట్లో ఉండే వారికి టి‌సి‌ఎస్ అద్భుత అవకాశం... వారికోసం ఫ్రీ ట్రైనింగ్..

By Sandra Ashok Kumar  |  First Published Apr 7, 2020, 12:17 PM IST

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూనే తమ ప్రతిభను మెరుగుపరచుకునేందుకు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది టీసీఎస్. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు 15రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణనివ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.


బెంగళూరు: కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ టైం సద్వినియోగం చేసుకోవాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) సంకల్పించింది. అందుకు అభ్యర్థులకు, ప్రత్యేకించి నిపుణులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. టీసీఎస్ అయాన్ ఆ సంస్థ డిజిటల్ లెర్నింగ్ హబ్ ప్లాట్ ఫామ్.

టీసీఎస్​ అనుబంధ అయాన్​ విభాగం ద్వారా 15 రోజులు ఉచిత నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కళాశాల విద్యార్థులు, ఉద్యోగార్థుల నైపుణ్యం  మెరుగుదల కోసం ప్రత్యేకంగా 'కెరీర్​ ఎడ్జ్​' పేరిట 'సెల్ఫ్​-పేస్​డ్​ డిజిటల్​ సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్'​ను రూపొందించింది.

Latest Videos

'ఈ కార్యక్రమంలో అభ్యాసకులు నేర్చుకునేందుకు వీలుగా నానో వీడియోలు, కేస్​ స్టడీస్​ ఉంటాయి. నైపుణ్యం పరంగా వారి బలాలు- బలహీనతలను అంచనా వేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్​ను మొబైల్​ఫోన్​, ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​, ట్యాబ్​ల వంటి పరికరాలతో యాక్సెస్​ చేసుకోవచ్చు’ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలిపింది. 

‘తద్వారా మనకు అవసరమైన విధంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కోర్సులు విద్యార్థులు, విద్యావేత్తలకు చక్కగా తోడ్పడతాయి’ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ తెలిపింది. 

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్: నిత్యావసర వస్తువులకు డిమాండ్... ఈ-రిటైల్ జాబ్స్‌కు ప్రియరిటి..

కొవిడ్​-19 వ్యాప్తి నేపథ్యంలో ఇంతకుముందే ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించింది టీసీఎస్​ అయాన్​. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలకు 'డిజిటల్​ గ్లాస్​ రూమ్​' పేరిట 'వర్చువల్​ లెర్నింగ్​' వేదికగా ఉచిత విద్యా కోర్సులను అందిస్తోంది. కెరీర్ ఎడ్జి ప్రోగ్రామ్ పూర్తిగా కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కెరీర్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టీసీఎస్ రూపొందించింది.

ఇదిలా ఉంటే గతవారం టీసీఎస్‌తోపాటు టాప్ 10 బ్లూ చిప్ కంపెనీలు రూ.2,82,548.07 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. టీసీఎస్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయాయి. 

టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.61,614.15 కోట్లు నష్టపోయి రూ.6,20,794.53 కోట్ల వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ రూ.50,199.49 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.49,332.07 కోట్లు కల్పోయాయి. 

ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,691.74 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ.28,996.74 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.13,611.62 కోట్లు కోల్పోయాయి. తద్బిన్నంగా ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,315.42 కోట్లు, రిలయన్స్ రూ.8,050.87 కోట్లు పెరిగింది. 

click me!