కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ స్టార్టప్ సంస్థ...

By Sandra Ashok Kumar  |  First Published May 15, 2020, 3:21 PM IST

 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడికి చేసేందుకు  హైదరాబాద్ స్టార్టప్ సంస్థ వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ ముందుకొచ్చింది.  రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తుపట్టడానికి, ప్రయాణికులను పరీక్షించడానికి “ట్రావెలర్ ట్రాకింగ్ సిస్టమ్” (టిటిఎస్) ను ప్రారంభించింది.


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు చేపడుతున్న కేసులు రోజుకు రోజుకు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ధీర్ఘ కాల లాక్ డౌన్ తరువాత కొన్ని సడలింపులతో మళ్ళీ లాక్ డౌన్  పొడిగించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడికి చేసేందుకు హైదరాబాద్ స్టార్టప్ సంస్థ వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ ముందుకొచ్చింది.  రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తుపట్టడానికి, ప్రయాణికులను పరీక్షించడానికి “ట్రావెలర్ ట్రాకింగ్ సిస్టమ్” (టిటిఎస్) ను ప్రారంభించింది.

Latest Videos

undefined

అలాగే త్వరలో తెలంగాణలోకి అన్ని జిల్లాల సరిహద్దులలో వీటిని ప్రారంభించనున్నార. కరోనా వైరస్ సోకిన వారిని కూడా ట్రాక్ చేస్తుంది.

కంటైన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ పై నిఘా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలతో సంస్థ ఇటీవల ‘ఐమాస్క్’ (ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్) ను ప్రారంభించింది.

also read నీరవ్ మోదీ చంపేస్తానన్నారు.. ఓ డమ్మీ డైరెక్టర్ ఆరోపణ...

సమర్థవంతమైన ప్రజారోగ్య నిర్వహణ వ్యూహాన్ని కలిగి ఉండటానికి ఇవి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సహకార కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

ట్రావెలర్ ట్రాకింగ్ సిస్టమ్ దీని ద్వారా సికుంద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కేవలం 90 నిమిషాల్లో 750 మంది ప్రయాణికులకు విజయవంతంగా కరోనా వైరస్ గుర్తించేందుకు పరీక్షించింది.

ముందు చర్యల్లో భాగంగా తెలంగాణకు ప్రవేశించే అన్ని సరిహద్దులో దీని ద్వారా పర్యవేక్షిస్తుంది అలాగే త్వరలో హైదరాబాద్ విమానాశ్రయంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.
 

click me!