నడుముకు బెడ్ షీట్ చుట్టుకుని గోడవారగా ఆస్పత్రిలోని ఆరో అంతస్థు నుంచి కిందికి దిగడానికి ప్రయత్నించి ఓ కరోనా అనుమానితుడు కిందపడి మరణించాడు. కర్నాల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కర్నాల్ (పంజాబ్): కరోనా అనుమానితుడు ఒకతను ఆస్పత్రిలోని ఆరో అంతస్థులో గల ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి మరణించాడు. పంజాబ్ లోని కర్నాల్ లో గల కల్పనా చావ్లా వైద్య కళాశాల కిటికీ నుంచి కింద పడిపోయి మరణించాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో జరిగింది.
బెడ్ షీట్లను, ప్లాస్టిక్ పాకెట్లను శరీరానికి చుట్టుకుని వాటి సాయంతో గోడను పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నించి పడిపోయాడు. పానీపట్టుకు చెందిన వ్యక్తి ఏప్రిల్ 1వ తేీదన ఐసోలేషన్ వార్డులో చేరాడు. కోవిడ్ 19 లక్షణాలు లేనప్పటికీ పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో అతన్ని ఐసోలేషన్ వార్డులో చేర్చినట్లు వైద్యులు చెప్పారు. అయితే, శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు. ఇంకా నివేదిక రావాల్సి ఉండింది.
ఢిల్లీలోని ఏయిమ్స్ లో గల ట్రామ సెంటర్ భవనం నుంచి దూకి ఆదివారంనాడు గాయపడ్డాడు. అతనికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలకు సంబంధించిన నివేదిక పెండింగులో ఉంది.
హర్యానాలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక వ్యక్తి మరణించాడు కూడా. కర్నాల్ లోని ఓ గ్రామానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరమించాడు. ఇదిలావుంటే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. మరణాల సంఖ్య వంద దాటింది.