కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నాయి. ఇందులో భాగంగానే పాన్ మసాలా, గుట్కాపై ఈ ఏడాది జూన్ 30వ తేది వరకు నిషేధం విధించినట్టుగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నాయి. ఇందులో భాగంగానే పాన్ మసాలా, గుట్కాపై ఈ ఏడాది జూన్ 30వ తేది వరకు నిషేధం విధించినట్టుగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
చూయింగ్ గమ్ , పాన్ మసాలాలపై విధించిన నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నోటిలోని లాలాజలంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో పాన్ మసాలాల, చూయింగ్ గమ్ ను తిని ఉమ్మివేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
Also read:కరోనా: వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది రక్షణకు బయో సూట్ తయారీలో డీఆర్‌డిఓ
ఈ మేరకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే గత ఏడాదిలో గుట్కా, పాన్ మసాలా, పొగాకుపై విధించిన నిషేధాన్ని మరో ఏడాదిపాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాన్ మసాలా, చూయింగ్ గమ్ ఉత్పత్తుల పంపిణీలపై కూడ తనిఖీలు నిర్వహించాలని కూడ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సుమారు రెండు వేలను దాటి పోయాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. అయినా కూడ రోజు రోజుకు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.